గోవా నుంచి విమానం ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తున్న నాన్ డ్యూటీ మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు
న్యూస్ లైన్ డెస్క్: గోవా నుంచి విమానం ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తున్న నాన్ డ్యూటీ మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. 12 లక్షల విలువ చేసే 415 మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి ఎయిర్ పోర్ట్ నుంచి వస్తున్నటువంటి 415 బాటిలను అధికారులు పట్టుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి నగరాన్నికి అక్రమంగా మద్యాన్నితరిలిస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం బాటిళ్లను పట్టుకొస్తున్న 12 మందిపై ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొత్తం 415 లీటర్ల మద్యం బాటిళ్లలో 352.68 లీటర్ల మద్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
నాన్ డ్యూటీ మద్యం వల్ల ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లుతుంది. దీంతో ఒక్కో బాటిల్‌పై పెద్ద మొత్తంలో ఆదాయ నష్టాన్ని ప్రభుత్వం చవిచూడాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే నాన్ డ్యూటీ లిక్కర్‌పై ఎక్సైజ్ అధికారులు ఉక్కు పాదం మోపుతున్నారు. కానీ నిందితులు ఏదో ఒకరకంగా రాష్ట్రంలోకి తీసుకొచ్చేందుకు అక్రమార్కులు వివిధ మార్గాల ద్వారా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అక్రమంగా మద్యాన్ని తరిలిస్తే కఠిన చర్యలు ఉంటాయిని ఎక్సైజ్ అధికారులు హెచ్చించారు.