Gold Price Today : పసిడిప్రియులకు గుడ్ న్యూస్ ..ఒకే సారి భారీగా తగ్గిన బంగారం

ఈ రోజు వీటి మీద వందరూపాయిలు తగ్గింది. తులం మీద అంటే గ్రాము మీద పది రూపాయిలు తగ్గినట్టు.


Published Aug 26, 2024 08:58:00 AM
postImages/2024-08-26/1724642945_gold.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశవ్యాప్తంగా బంగారం , వెండి ధరలు రేట్లు పెరుగుతూ వచ్చాయి. అయితే వారం ఆరంభంలో మాత్రం బంగారం భారీగా తగ్గింది. బంగారం ధర నిన్న 10 గ్రాములు 24 క్యారట్ల అయితే 73వేల 300గా నమోదయ్యింది. 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,950 గా అమ్ముడయ్యింది. ఈ రోజు వీటి మీద వందరూపాయిలు తగ్గింది. తులం మీద అంటే గ్రాము మీద పది రూపాయిలు తగ్గినట్టు.


*దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.67,100 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 73,190. 


*ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.66,950 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.73,040.


*చెన్నైలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,950 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,040 వద్ద కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ధర కాసింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు మార్కెట్ వర్గాలు . అయితే బంగారం ధర ఫైనల్ రేటు తులం 24 క్యారట్లు 73040 అయినా ..దీనికి జీఎస్టీ ..ఛార్జీలు మేకింగ్ ఛార్జీలు లాంటివి యాడ్ చేసి అమ్ముతారు. సో చూసుకొని చెక్ చేసుకొని కొనుక్కొండి.


* వెండిధరలు కూడా స్థిరంగా ఉన్నాయి.


తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.93,000 వద్దకు చేరింది.


చెన్నైలో కిలో వెండి ధర రూ.93,000.


కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి రూ. 88,000 వద్ద కొనసాగుతుంది.
బెంగళూరులో వెండి ధర రూ. 84,500 వద్ద కొనసాగుతుంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business goldrates silver-rate

Related Articles