gold: భారీగా పెరిగిన పుత్తడి ...సిల్వర్ అయితే మరీ దారుణంగా ఉందిగా ?

ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ. 73,554 ఉండేది ఈ రోజు 73వేల 614 రూపాయిలు మార్కెట్ ధర నడుస్తుంది.


Published Sep 09, 2024 11:06:00 AM
postImages/2024-09-09/1725860266_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశంలో బంగారం ధర రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ , సిల్వర్ రేట్లు దారుణంగా పెరిగాయి. దేశంలో పసిడి , వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి నిన్నధరకి...ఈ రోజు మరో 60 రూపాయిలు పెరిగింది. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ. 73,554 ఉండేది ఈ రోజు 73వేల 614 రూపాయిలు మార్కెట్ ధర నడుస్తుంది.


హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.73,614గా ఉంది. కిలో వెండి ధర రూ.83,575గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇదే ధర నడుస్తుంది. ప్రస్తుతం ఉన్న వరదలు, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆటుపోట్లు కారణంగా మార్కెట్ చాలా జోరుగా నడుస్తుంది.


* ఢిల్లీలో అయితే 24 క్యారట్ల బంగారం 83,600 నడుస్తుంది. మార్కెట్లో జీఎస్టీలు, ట్యాక్సులు కలిపి రేటు వేరే ఉంటుంది.


* ముంబై లోను ఇదే రేటు వెండి మాత్రం 83 వేల 500 రేటు నడుస్తుంది.


కిలో వెండి ధర రూ.83,364 ఉండగా, సోమవారం నాటికి రూ.211 పెరిగి రూ.83,575కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే దాదాపు 10 వేల రూపాయిలు ఎక్కువ . అంటే 93వేల 575 కు చేరింది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business goldrates silver-rate

Related Articles