gold: దిగొచ్చిన పసిడి ధరలు...సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయంటే ?

వారం లోపూ మళ్లీ పెరిగిపోయాయి. మంచిరోజులు కావడంతో గ్రాము నుంచి తులాలు తులాలు బంగారం కొంటూనే ఉంటారు.


Published Sep 06, 2024 08:58:00 AM
postImages/2024-09-06/1725593374_gold.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: భారతీయులు అందులోను తెలుగు రాష్ట్రాల ప్రజలు మరీ ఎక్కువగా బంగారం మీద మక్కువ చూపిస్తారు. కార్యం ఏదైనా తులం ఫలమో అన్నట్లు కొంటూనే ఉంటారు. బడ్జెట్ ఎఫెక్ట్ లో విదేశాల నుంచి దిగుమతి చేసే బంగారం, వెండిపై సుంఖం తగ్గించారు. వారంలో తగ్గినా ..కానీ వారం లోపూ మళ్లీ పెరిగిపోయాయి. మంచిరోజులు కావడంతో గ్రాము నుంచి తులాలు తులాలు బంగారం కొంటూనే ఉంటారు.


ప్రస్తుతం మేలిమి బంగారం అంటే 24 క్యారట్ల బంగారం  రూ.73 దాటిపోయింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధరపై రూ.10 తగ్గి, రూ. 66,680, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 తగ్గి, రూ.72,750గా ఉంది. అయితే ఇఫ్పుడు తగ్గిందల్లా కేవలం గ్రాము మీద పది రూపాయిలు . 10 గ్రాములకు 100 రూపాయిలు తగ్గింది.  ఏపీ, తెలంగాణలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ. 66,680, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.72,750 గా మార్కెట్ నడుస్తుంది.


దేశంలోని ప్రధాన నగరాల్లో .. ఢిల్లీ 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ. 66,830, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.72,900 వద్ద కొనసాగుతుంది. వీటిపై జీఎస్టీలు , షో రూమ్ ట్యాక్స్ లు అన్ని కలిపి స్వల్పంగా ధర పెరగొచ్చు.


ముంబై, బెంగుళూరు, కేరళా, కోల్‌కొతా 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ. 66,680, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.72,750 వద్ద కొనసాగుతుంది. 


చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ. 66,680, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.72,750 వద్ద కొనసాగుతుంది.  


దేశంలో కిలో వెండిపై రూ.100 తగ్గింది. ఏపీ, తెలంగాణ, చెన్నైలో కిలో వెండి ధర రూ. 89,900,  బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 82,900, ముంబై, కోల్‌కొతా, కేరళా రూ. 84,900 వద్ద కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 93  వేల పై మాటే నడుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : business goldrates silver-rate stock-market

Related Articles