Gold price:బడ్జెట్ ఎఫెక్ట్:దారుణంగా పడిపోయిన పసిడి ధరలు..ఈ రోజు ఎంతంటే?

గత సంవత్సర కాలం నుంచి పసిడి, వెండి ధరలు ఆకాశానికి ఎక్కాయి తప్ప  తరుగుదల కనిపించలేదు.  కానీ కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఎప్పుడైతే జరిగాయో అప్పటినుంచి బంగారం, వెండి ధరలు రోజురోజుకు పడిపోతూ వస్తున్నాయి. సాధారణంగా ఈ పసిడిని ఎక్కువగా ఇష్టపడేది మన ఇండియన్స్. రాజుల కాలాల నుంచే బంగారం వెండికి ఎంతో ఆదరణ ఉంది.  ఇందులో  మహిళలు బంగారు, వెండి ఆభరణాలను అత్యంత ఎక్కువగా ఇష్టపడతారు. ఈ క్రమంలో పురుషులు కూడా బంగారు వెండి నగలపై కాస్త మోజు చూపిస్తున్నారు.  


Published Jul 25, 2024 09:36:53 AM
postImages/2024-07-25/1721880413_goldrate.jpg

న్యూస్ లైన్ డెస్క్: గత సంవత్సర కాలం నుంచి పసిడి, వెండి ధరలు ఆకాశానికి ఎక్కాయి తప్ప  తరుగుదల కనిపించలేదు.  కానీ కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఎప్పుడైతే జరిగాయో అప్పటినుంచి బంగారం, వెండి ధరలు రోజురోజుకు పడిపోతూ వస్తున్నాయి. సాధారణంగా ఈ పసిడిని ఎక్కువగా ఇష్టపడేది మన ఇండియన్స్. రాజుల కాలాల నుంచే బంగారం వెండికి ఎంతో ఆదరణ ఉంది.  ఇందులో  మహిళలు బంగారు, వెండి ఆభరణాలను అత్యంత ఎక్కువగా ఇష్టపడతారు. ఈ క్రమంలో పురుషులు కూడా బంగారు వెండి నగలపై కాస్త మోజు చూపిస్తున్నారు.  

ఈ విధంగా భారతదేశంలో బంగారం వినియోగం పెరిగిపోవడంతో దీని ధర పెరుగుతూ వస్తోంది తప్ప ఎక్కడ కూడా తగ్గడం లేదు. గత సంవత్సర కాలం నుంచి బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగింది. దీంతో గోల్డ్ కొనేవారు వెనుకడుగు వేశారు. అలాంటి వారికి ఇదొక బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. తాజాగా బడ్జెట్ సమావేశాల తర్వాత బంగారం ధర తరచూ తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం తులం బంగారంపై  5వేలకు పైగా పడిపోయింది.  దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం బంగారం  దిగుమతులపై కష్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటన చేయడం వల్ల ఒక్కసారిగా బంగారం ధరలు దిగివచ్చాయి.

అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్ లో కూడా ఈ బంగారం ధరలు తగ్గిపోయాయి. అంతకుముందు ధరతో  చూసుకుంటే స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు దాదాపు 20 డాలర్ల వరకు పడిపోయింది.  ప్రస్తుతం ఔన్స్ ధర 2394 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఈ విధంగా సిల్వర్ రేటు కూడా చాలా తగ్గిపోయింది. తగ్గిన ధరల ప్రకారం ప్రస్తుత ధర 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారంపై  రూ:10తగ్గి 64,940 కి చేరింది. అంతేకాకుండా 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారంపై  రూ:10 తగ్గి 70,850 కి చేరింది.

ఇక తెలుగు రాష్ట్రాలైనటువంటి విజయవాడ,  హైదరాబాద్, వరంగల్ లో బంగారం ధరలు  22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర  రూ:64,940 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ:70,850వద్ద కొనసాగుతోంది. ఇక దేశంలోని కీలక నగరాలైనటువంటి ఢిల్లీలో కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ:65,090, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,000 వద్ద కొనసాగుతోంది. ఈ విధంగా చాలా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా తగ్గుతూ వస్తున్నాయి.  ఇక వెండి ధర విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర 91,900 ఉండగా, ముంబై, ఢిల్లీ, కోల్ కత్తాలో 87,400రూపాయలుగా కొనసాగుతోంది.

newsline-whatsapp-channel
Tags : news-line hyderabad gold-rates silver-rate budjet

Related Articles