MAD Square: మరో సారి మ్యాజిక్ చేయబోతున్న మ్యాడ్ బాయ్స్ !

కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నిర్మాతలు మరో గుడ్ న్యూస్ చెప్పారు . ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ ను సెప్టెంబర్ 20వ తేదీ విడుదల చేస్తున్నట్లు తెలిపారు.


Published Sep 18, 2024 02:44:33 AM
postImages/2024-09-18/1726645363_BeFunkydesign23.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: లాస్ట్ ఇయర్ మ్యాడ్ మూవీ ఏ రేంజ్ హిట్టో తెలుసు కదా...నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు చేశారు. సినిమా చాలా యూత్ ఫుల్ గా ..చాలా బాగుంటుంది.కొన్ని నెలల క్రితం బ్లాక్‌బస్టర్‌ సినిమా ‘మ్యాడ్’కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్‌’ని అనౌన్స్ చేసింది మూవీ టీం.  కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నిర్మాతలు మరో గుడ్ న్యూస్ చెప్పారు . ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ ను సెప్టెంబర్ 20వ తేదీ విడుదల చేస్తున్నట్లు తెలిపారు.


ఈ తీపి కబురుని తెలపడమే కాకుండా, సాంప్రదాయ దుస్తులలో ఉన్న మ్యాడ్ గ్యాంగ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది మూవీ టీం. మ్యాడ్ స్క్వేర్ పోస్టర్ దుమ్ముదులిపేశారంటున్నారు నెటిజన్లు. మొదటి భాగానికి భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన పాటలన్నీ చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇప్పుడు రెండో భాగంలో అంతకుమించిన చార్ట్‌బస్టర్ పాటలు ఉంటాయని నిర్మాతలు చెబుతున్నారు.శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రొడ్యూసర్ సూర్యదేవ నాగవంశీ చేస్తున్నారు.


మూవీ కోసం టీం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఛాయాగ్రాహకుడు షామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. మ్యాడ్ సీక్వెల్ లో నూ నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ శంకర్ డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమా ను ఎలా ఉంటుందో చూడాలి.

newsline-whatsapp-channel
Tags : movie-news first-love mad-sqare-movie

Related Articles