Harish rao: ఉప ఎన్నిక‌లు పక్కా..!

 ఎమ్మెల్యేల అన‌ర్హ‌త అప్లికేష‌న్ల‌పై హైకోర్డు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్ర‌జాస్వామ్య విధానాల‌కు చెంప పెట్టు అని ఆయన విమర్శించారు. తెలంగాణ హైకోర్డు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అన‌ర్హ‌త‌కు గురికావ‌డం త‌థ్యమని ధీమా వ్యక్తం చేశారు.
 


Published Sep 09, 2024 12:58:47 PM
postImages/2024-09-09/1725866927_Byelectionsintelangana.jpg

న్యూస్ లైన్ డెస్క్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం తథ్యమని మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడించారు. ఎమ్మెల్యేల అన‌ర్హ‌త ఫిటీష‌న్‌ల‌పై తెలంగాణ హైకోర్డు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామంటూ ఆయన ట్వీట్ చేశారు. ఎమ్మెల్యేల అన‌ర్హ‌త అప్లికేష‌న్ల‌పై హైకోర్డు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్ర‌జాస్వామ్య విధానాల‌కు చెంప పెట్టు అని ఆయన విమర్శించారు. తెలంగాణ హైకోర్డు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అన‌ర్హ‌త‌కు గురికావ‌డం త‌థ్యమని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ హైకోర్డు తీర్పు ప్ర‌జాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్పూర్తిని నిల‌బెట్టే విధంగా ఉందని ఆయన తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అన‌ర్హ‌త‌కు గురై ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉప ఎన్నిక‌లు రావ‌డం ఖాయమని తెలిపారు. ఉప ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో BRS గెలవడం తథ్యమని హరీష్ రావు వెల్లడించారు. హైకోర్డు తీర్పుకు అనుగుణంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ నాలుగు వారాల్లో నిర్ణ‌యం తీసుకుని ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడ‌తార‌ని ఆశిస్తున్నామని హరీష్ రావు తెలిపారు. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu brs tspolitics telanganam harish-rao harishrao byelections

Related Articles