Harish rao: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి హరీశ్‌రావు లేఖ

ఒకవైపు రిజర్వాయర్లలో నీళ్లు లేక, మరోవైపు వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని.. పంటలు వేయాలా వద్దా అనే అయోమయంతో రైతులు ఆవేదన చెందుతున్నారని హరీశ్‌రావు తెలిపారు. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే జిల్లాల పంటల సాగు విస్తీర్ణం కూడ తగ్గి పోయిందని ఆయన వెల్లడించారు.

Published Aug 03, 2024 12:00:45 AM
postImages/2024-08-03/1722661207_harishrao.jpg

న్యూస్ లైన్ డెస్క్: నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీశ్‌రావు లేఖ రాశారు. సిద్దిపేట జిల్లాలో ప్రాజెక్టులు అడుగంటిపోతున్నాయని లేఖలో పేర్కొన్నారు. మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ, అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌లో నీళ్లులేక అడుగంటిపోయే పరిస్థితికి వచ్చాయని ఆయన వెల్లడించారు. 

ఒకవైపు రిజర్వాయర్లలో నీళ్లు లేక, మరోవైపు వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని.. పంటలు వేయాలా వద్దా అనే అయోమయంతో రైతులు ఆవేదన చెందుతున్నారని హరీశ్‌రావు తెలిపారు. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే జిల్లాల పంటల సాగు విస్తీర్ణం కూడ తగ్గి పోయిందని ఆయన వెల్లడించారు.

కాబట్టి రాజకీయాలు పక్కనబెట్టి మిడ్ మానెర్ నుండి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ లకు నీటిని విడుదల చేయాలని అయన సూచించారు. ఈ మేరుకు ఇరిగేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని, అదేవిధంగా కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టుకు నీళ్లందించేలా చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu brs minister telanganam farmers congress-government harish-rao agriculture-minister uttamkumarreddy ministeruttam

Related Articles