న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఐఐటీ క్యాంపస్ లో మొసలా ...దేవుడా ..ఎలా వచ్చింది ఇలా వేల ప్రశ్నలు వస్తుంటాయి. అసలు ఏం జరిగిందంటే...మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ప్రముఖ విద్యా సంస్థ అయిన ఐఐటీ బాంబే క్యాంపస్‌లో ఆదివారం రాత్రి వేళ భారీ మొసలి హల్‌చల్ చేసింది. మొసలి క్యాంపస్ లో స్టైల్ గా పాకుతూ రావడాన్ని విద్యార్ధులు చూశారు. వెంటనే భయంతో అరుస్తూ పారిపోయేందుకు పరుగులు తీశారు. దీంతో వెంటనే సెక్యూరిటీ స్పందించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ సిబ్బంది రంగంలోకి దిగారు. మొసలి స్థానికంగా ఉన్న పద్మావతి ఆలయంలోని సరస్సు నుంచి వచ్చినట్లుగా గుర్తించారు.
అయితే ఆదివారం సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లుగా అటవీ శాఖ సిబ్బంది పేర్కొన్నారు. అయితే , ఇలాంటి ఘటనలు ఇది మొదటి సారి కాదని ...చాలా సార్లు పొవాయ్ సరస్సు నుంచి కూడా మొసళ్లు వచ్చాయని స్థానికులు అంటున్నారు. ఇకనైనా ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలంటూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, క్యాంపస్ సిబ్బంది అటవీ అధికారులకు విజ్క్షప్తి చేశారు.