Video Viral:పారిపోతున్న ఉగ్రవాదిపై ఇండియన్ ఆర్మీ కాల్పులు.!

సాధారణంగా మనం సినిమాల్లో ఉగ్రవాదులపై, తీవ్రవాదులపై పోలీసులు కాల్పులు జరపడం మనం చూస్తాం. కానీ అందులో మొత్తం యాక్టింగ్ చూపిస్తారు. కానీ పోలీసులు, ఆర్మీ రియల్ గా ఉగ్రవాదులపై


Published Sep 16, 2024 03:59:07 PM
postImages/2024-09-16/1726482547_indian1.jpg

న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా మనం సినిమాల్లో ఉగ్రవాదులపై, తీవ్రవాదులపై పోలీసులు కాల్పులు జరపడం మనం చూస్తాం. కానీ అందులో మొత్తం యాక్టింగ్ చూపిస్తారు. కానీ పోలీసులు, ఆర్మీ రియల్ గా ఉగ్రవాదులపై కాల్పులు ఎలా జరుపుతారు వారిని ఎలా పట్టుకుంటారనేది ఈ వీడియోలో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది అయితే తాజాగా జమ్మూ కాశ్మీర్ లో బారముల్లా చౌక్ తప్పారులో శనివారం రాత్రి భద్రత బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపాయ్.  

ఈ టైంలోనే ఒక ఉగ్రవాది ఒక బిల్డింగులో దాక్కున్న విషయం ఆర్మీ వాళ్లకు తెలియడంతో డ్రోన్ సహాయంతో ఇండియన్ ఆర్మీ బుల్లెట్ల వర్షం కురిపించింది.  దీంతో ఆ ఉగ్రవాది భయపడి పోయి తన వద్ద ఉన్న ఏకే 47తో డ్రోన్ ను కూల్చేందుకు ప్రయత్నం చేశాడు.  సాధ్యం కాకపోవడంతో ఉగ్రవాది భయంతో బయటకు పరిగెత్తి పొదల్లో దాక్కోడానికి ప్రయత్నం చేశాడు.  కానీ ఇండియన్ ఆర్మీ కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ తీవ్రంగా కాల్పులు జరిపింది.

దీంతో ఆ ప్రాంతమంతా బుల్లెట్ల మోత మోగింది. జమ్మూ కాశ్మీర్ లో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో పాకిస్తాన్ నుంచి ఎంతోమంది ఉగ్రవాదులు  చొరబడే ప్రయత్నం చేస్తున్నారట.  గత వారం రోజుల్లోనే మూడుసార్లు ఉగ్రవాదులు భారత్ లోకి ఆక్రమంగా వచ్చేందుకు ప్రయత్నం చేయగా, చాలామందిని పట్టుకొని ఇండియన్ ఆర్మీ  కతం చేసేసింది. ఇక వీళ్లే కాకుండా మరో 80 మంది ఉగ్రవాదులు రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి పాక్ రేంజర్లు సైన్యం కూడా సహకారం అందిస్తోందట.

ఇదే తరుణంలో సెప్టెంబర్ 18న జమ్మూకాశ్మీర్ లో 24 స్థానాలు తొలి విడత ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఇక్కడికి ప్రధాని మోడీ స్టార్ కంపెనర్ గా పర్యటన కోసం వెళ్తున్న సందర్భంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కానీ ఉగ్రవాదుల ఆగడాలను పాకు సైన్యం  సునాయాసంగా  తిప్పి కొడుతోంది.

https://x.com/shams_gazelle/status/1835485211666055441?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1835485211666055441%7Ctwgr%5E33718d66b1d6c23ab89e686ffd5df3843171c92a%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F

 

newsline-whatsapp-channel
Tags : news-line jammu-kashmir police pakistan indian-army terrarist

Related Articles