ఈ కార్యక్రమానికి ఏఐ సాయంతో నిర్వహించాలని యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు అధికారులు యుధ్దప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: వచ్చే యేడాది 2025 జనవరిలో ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు దాదాపు 40 కోట్లకు పైగా భక్తులు హాజరవుతారని అంచనావేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఏఐ సాయంతో నిర్వహించాలని యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు అధికారులు యుధ్దప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారు. అంతే కాదు ...ప్రతి ప్రాంతం కవర్ అయ్యేలా సీసీ కెమరాలు , జీరో ఎనిమల్ జోన్ ను ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించారు.
ఈ ప్రాంతంలో జంతువులు అనగానే కుక్కలు , పిల్లులు కాదు ఒంటెలు, గుర్రాలు ..మహాకుంభమేళాలో భక్తులతో పాటు ఈ జంతువులను కూడా హ్యాండిల్ చెయ్యడం సెక్యురిటీ లో చాలా ఇబ్బందులు తెస్తుంది.. సంగమ ప్రాంతంతో పాటు నైనీ, జున్సీ, సివిల్ లైన్స్ ప్రాంతాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని పెద్ద, చిన్న జంతువుల కార్యకలాపాలను పూర్తిగా నిషేధించారు. పెద్ద జంతువులను కుంభమేళా ప్రాంతం నుండి బయటకు తరలించేందుకు నగరపాలక సంస్థ ఇప్పటినుండే ప్రచారం చేపడుతోంది. ఈ సమయంలో ఎలాంటి జంతువులను రోడ్లపై వదలకూడదని పశువుల కాపరులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు.
నగరంలో జంతువుల కోసం ఓ ప్రత్యేకమైన షెడ్డులు ఏర్పాటు చేస్తారు. వీటికి తిండి, నీడ ఏర్పాటు చేసే బాధ్యత కేవలం ప్రభుత్వం తీసుకుంటుంది. చుట్టుప్రక్కల డైరీ యజమనులను ఇప్పటి నుంచే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జనవరి మొదటి వారం నుంచే పశువులు రోడ్లపై కనిపించకూడదు. 2025 జనవరి నుండి 31 మార్చి 2025 వరకు ఈ ఏర్పాట్లు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు.