Moral:కప్పు పెరుగు..కోడలి బుద్ధి మార్పు..ప్రతి భర్త చదవాల్సిందే.?

ప్రస్తుత సమాజంలో చాలామంది ఆడపిల్లలు మెట్టినింటా అడుగు పెట్టిన తర్వాత అత్తమామలను  కాస్త డిఫరెంట్ గా చూడడం చూస్తూనే ఉంటాం.  తన సొంత తల్లిదండ్రులైతే


Published Aug 21, 2024 12:34:38 AM
postImages/2024-08-21/1724218169_kodal.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత సమాజంలో చాలామంది ఆడపిల్లలు మెట్టినింటా అడుగు పెట్టిన తర్వాత అత్తమామలను  కాస్త డిఫరెంట్ గా చూడడం చూస్తూనే ఉంటారు.  తన సొంత తల్లిదండ్రులైతే బాగుండాలనుకుంటారు, కానీ అత్తమామలైతే అవసరం లేదంటారు. అలా మెట్టి నింటా  అడుగుపెట్టినటువంటి కోడళ్ళకు  కాస్త బుద్ధి తెప్పించే స్టోరీ ఇప్పుడు చూద్దాం.. ఆయన ఒక వ్యాపారి. ఎంతో కష్టపడి వ్యాపారాన్ని అంచలంచలుగా విస్తరించాడు. వయస్సు 40దాటింది. అంతలో భార్య చనిపోయింది. బంధువులు, స్నేహితులు  రెండో పెళ్లి చేసుకొని స్థిరపడమని ఎన్నో విషయాలు చెప్పారు.

కానీ తన కొడుకు మొహం చూసి  తాను రెండో పెళ్లికి దూరమైపోయి వ్యాపారాన్ని, కొడుకును పెంచి పెద్ద చేశాడు. చివరికి కుమారుడికే తన వ్యాపారాన్ని అప్పగించి  అన్ని అరేంజ్మెంట్ చేశాడు. అలా కొన్నాళ్ల తర్వాత పెళ్లి కూడా జరిపించి  కొడుకు హ్యాపీగా జీవించేలా చేశాడని చెప్పవచ్చు. అలా కాలం గడుస్తూ పోతుంది. వ్యాపారికి కాస్త 60 సంవత్సరాలు వచ్చాయి. ఓ రోజు కొడుకు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. గుమ్మం వద్ద ఉన్నాడు. నాన్న భోజనం చేస్తూ కాస్త పెరుగంటే తే అమ్మ అని కోడలికి చెప్పాడు. దీంతో కోడలు అయ్యో పెరుగు లేదండి అని కాస్త వెటకారంగా చెప్పింది. దీంతో ఆయన పర్లేదులే అమ్మ అని భోజనం ముగించుకొని వెళ్లిపోయాడు.

ఆ తర్వాత లోపలికి వచ్చిన కొడుకు స్నానం చేసి భోజనానికి కూర్చున్నాడు. భార్యాభర్తలు తింటున్న క్రమంలో కొడుకు పెరుగు తే అని చెప్పాడు. వెంటనే ఫ్రిడ్జ్ లోంచి పెద్ద గిన్నెలో ఉన్నటువంటి పెరుగు పట్టుకొచ్చి ముందు పెట్టింది. దీంతో ఆ వ్యక్తి చాలా బాధపడ్డాడు. పెరుగు ఉన్న నాన్నకు పోయలేదు అని మనసులోనే అనుకున్నాడు. అలా ఆరోజు మౌనంగా వెళ్ళిపోయాడు..ఆయన పడుకున్న, ఆఫీసుకు వెళ్లినా కానీ నాన్నకు పెరుగు వేయలేదే అనే ఆలోచన మదిలో తడుతోంది.

నా కొరకు నాన్న అంత త్యాగం చేస్తే  ఆయన సంపాదన తింటున్న మేము  కనీసం కప్పు పెరుగు అందించలేకపోయాం అని అదే ఆలోచించుకుంటూ బాధపడుతున్నాడు. దీంతో తండ్రికి రెండో పెళ్లి చేస్తే హ్యాపీగా ఉంటాడని అనుకున్నాడు. కానీ తండ్రి ఈ విషయాన్ని అసలు ఒప్పుకోడని ఆలోచన చేశాడు. ఎలాగోలా తండ్రిని బాగా చూసుకోవాలనుకున్నాడు. ఇటు భార్యకు గట్టిగా అడిగితే నేనేమన్నానని దబాయిస్తుంది. ఇద్దరినీ ఏమనలేక తనలో తానే మదన పడుతున్నాడు. భార్యని ఎలాగైనా మార్చాలి అనుకున్నాడు.  మంచి ప్లాన్ తో మరుసటి రోజు వేకువ జామున తన భార్యకు తెలియకుండా తండ్రిని మరో ఊరు తీసుకెళ్లి ఒక మంచి ఇల్లు చూసి అందులో తండ్రిని ఉంచాడు. తండ్రి బాగోగులు చూసుకునేందుకు ఒక వ్యక్తిని కూడా నియమించాడు.

తన  భార్య మరుసటి రోజు   ఉదయం లేచి చూసేసరికి మామ కనిపించలేదు.  ఎక్కడికో వెళ్లిపోయాడు అనుకుంది. భర్తను అడిగితే నాకు తెలియదు అన్నాడు. అలా వారం, నెల గడిచిపోయింది ఆచూకీ  తెలియలేదు. ఓ రోజు ఉదయం భర్త ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత ఏదో పనిమీద గుమస్తా ఇంటికి వచ్చారు. దీంతో ఆ వ్యక్తిని తన మామ గారి గురించి అడిగింది. అసలు ఏం జరిగిందో తెలియదు అమ్మ, కానీ పెద్దాయనకు మరో పెళ్లి చేస్తున్నారని తెలుస్తోంది. ఏర్పాట్లు  కూడా పూర్తవుతున్నాయి. ఇక నుంచి వ్యాపారం కూడా పెద్దాయన చూసుకుంటారట.

 మీరు ఉండే ఈ ఇల్లు కూడా ఆయనకే చెందుతుందట మిమ్మల్ని అద్దె ఇంట్లో మార్చుతారని అనుకుంటున్నారు.  గుమస్తా చెప్పిన మాటలు విన్నటువంటి కోడలు ఒక్కసారిగా నివ్వెర  పోయింది. తన భవిష్యత్తు జీవితం కళ్ళ ముందు కనబడింది. తాను అన్ని విలాసాలు అనుభవిస్తుంది అంటే కారణం, తన మామ అనే విషయాన్ని గ్రహించింది.  ఇప్పుడు కొత్త అత్తగారు ఇంట్లోకి వస్తే తన పరిస్థితి ఏంటో అర్థం చేసుకుంది.  గుమస్తా ద్వారా తన మామగారు ఉంటున్న చోటుకు వెళ్లి కాళ్లపై పడి క్షమాపణ కోరి తన ఇంటికి తీసుకువచ్చింది.

అప్పటినుంచి కోడలు తన మామను తన సొంత తండ్రిలా చూసుకుంటుంది. ఈ విధంగా ఒక కప్పు పెరుగు కోడలి జీవితాన్ని మార్చింది. ఈ విధంగా కొడుకు తన బాధ భార్యకు తెలియాలని చెప్పి ఈ నాటకమాడి భార్యకు తెలిసేలా చేశాడని చెప్పవచ్చు. చివరికి తన భర్తను కూడా నేను తప్పు చేశాను క్షమించమని కోరింది. దీనిపై మీ కామెంట్ ఏంటో చెప్పండి.

newsline-whatsapp-channel
Tags : story daughter-in-law uncle business-man son moral-story

Related Articles