ఈ కాలంలో ఏ ఏ ఆహారమైన సరే కల్తీ జరుగుతోంది. ఈ కల్తీ అనేది ముందుగా మనకు పండే పంట నుంచే మొదలవుతోంది. చాలామంది తక్కువ కాలంలో ఎక్కువ పంట రావాలని రసాయనిక ఎరువులు
న్యూస్ లైన్ డెస్క్: ఈ కాలంలో ఏ ఏ ఆహారమైన సరే కల్తీ జరుగుతోంది. ఈ కల్తీ అనేది ముందుగా మనకు పండే పంట నుంచే మొదలవుతోంది. చాలామంది తక్కువ కాలంలో ఎక్కువ పంట రావాలని రసాయనిక ఎరువులు వాడుతూ ముందుగానే పంటలలోకి విషాన్ని ఎక్కిస్తున్నారు. దాన్ని మనం తింటూ రోగాల బారిన పడుతున్నాం. దీనికి తోడు మనం తినే ఇతర ఆహార పదార్థాలను కూడా కృత్రిమంగా తయారు చేస్తూ మరింత సమాజాన్ని చెడగొడుతున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనం ప్రతిరోజు వాడుకునే ఆయిల్. వంట నూనె లేనిదే ఏ ఆహార పదార్థం తయారు కాదు.
అలాంటి ఆయిల్ విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు. ఎంతో చక్కగా కనిపించే ఆయిల్స్ అన్ని మంచివి కాదని చాలా వరకు కల్తీ జరుగుతున్నాయని తెలియజేస్తున్నారు. మరి మనం కొనే ఆయిల్ మంచిదా లేదంటే కల్తీదా తెలుసుకోవడానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఆలివ్ ఆయిల్ ను వాడుతున్నట్లయితే దాన్ని ఒక కంటైనర్ లో తీసుకొని డీప్ ఫ్రిజ్ లో పెట్టేయండి. అది స్వచ్ఛత కలిగిన ఆయిల్ అయితే 30 నిమిషాల్లో గడ్డ కడుతుంది. ఒకవేళ గడ్డ కట్టకుంటే అది నకిలీ ఆయిల్. అంతేకాకుండా మీరు ఆవాల నూనె ఉపయోగిస్తున్నట్లయితే దాన్ని పాన్లో పోసి బలమైన పొగ వచ్చేటట్టు వేడి చేయండి.
ఒక పూర్తిగా వచ్చిన తర్వాత అది వాసన కూడా వచ్చి నల్లగా మారిందంటే నకిలీదని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మార్కెట్లో మనం కొని నూనె బాటిల్స్ మూత సీల్ సరిగా ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. ఒకవేళ మూత కాస్త లూజ్ గా ఉంటే మాత్రం ఆ నూనె కల్తీ జరిగిందని అర్థం. వీలైనంతవరకు నూనెను విడిగా కొనొద్దు. ముఖ్యంగా కల్తీ చేయని నూనెలు మంచి వాసన వస్తాయి. ఆలివ్ ఆయిల్ అయితే తాజా పండ్ల వాసన వస్తుంది. ఒకవేళ నూనె దుర్వాసన వచ్చింది అంటే అది కల్తీ చేసినట్టే. సురక్షితం కానీ నూనె ఫ్రిడ్జ్ లో పెడితే గడ్డ కట్టదు. సురక్షితమైనదైతే గడ్డకట్టుతుందని నిపుణులు అంటున్నారు.