తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీకి పెద్దన్నలా మారారు మెగాస్టార్ చిరంజీవి. అలాంటి ఈయన పునాదిరాళ్లు సినిమా ద్వారా తన కెరియర్ ను స్టార్ట్ చేసి
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీకి పెద్దన్నలా మారారు మెగాస్టార్ చిరంజీవి. అలాంటి ఈయన పునాదిరాళ్లు సినిమా ద్వారా తన కెరియర్ ను స్టార్ట్ చేసి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలా ఎంతో కష్టపడుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ పెద్ద స్టార్ హీరో అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి నట వారసత్వాన్ని పట్టుకొని ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చారు.
అలా ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగినటువంటి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అన్నకు చాలా స్పెషల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. "నా దృష్టిలో ఆపద్బాంధవుడు మా అన్నయ్య చిరంజీవి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. అన్నయ్య ఆపత్కాలంలో ఉన్న ఎందరికో సాయం అందించాడు. ఆ విషయం నాకు తెలుసు.
అనారోగ్యం బారిన పడిన వారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొందరికి చేసిన సాయం మీడియాతో బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు సైలెంట్ గా ఉండిపోయాయి. తనకు కావలసిన వారి కోసం ఎంతవరకైనా తగ్గుతారు. బ్రతిమిలాడుతారు. అలాంటి గుణమే ఆయనను ఇంతటి స్వరూపుణ్ణి చేసిందేమో, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కీలక దశకు చేరుకున్న తరుణంలో ఐదు కోట్ల విరాళాన్ని జనసేనకి అందించి విజయాన్ని అందుకోవాలని మా ఇంటి ఇలవేల్పు ఆంజనేయ స్వామి సాక్షిగా అన్నయ్య ఆశీర్వదించారు.
ఆయన ఆరోజు నాకు ఇచ్చిన బలం, మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని అందించాయి. అలాంటి గొప్ప దాతను నాకు అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతుని సదా కృతజ్ఞతలు తెలుపుతున్న. మా తల్లి లాంటి మా వదినమ్మతో ఆయన ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను అని పవన్ తన ఆత్మీయ అన్నయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు.