న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఆరు రోజుల క్రితం చనిపోయారు. చాలా విలువలతో కూడిన వ్యాపారాన్ని నిర్వహించడమే కాదు ఎంతో ఉన్నత ఆదర్శాలు కలిగిన వ్యక్తి. అయితే తనను గురించిన ఎన్నో విషయాలు ఇప్పుడు వైరల్ అవుతుంది. 1996లో నాటి ప్రధాని పీవీ నరసింహారావుకు రతన్ టాటా రాసిన లేఖ ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. రతన్ టాటాను గుర్తుచేసుకుంటూ ఆర్‌పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయెంకా ఈ లేఖను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ‘‘ఒక అందమైన వ్యక్తి నుంచి అందమైన రచన...’’ అని గోయెంకా క్యాప్షన్ ఇచ్చారు.
రతన్ టాటా రాసిన అక్షరాల కోసం సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. అసలు ఇంతకీ ఈ లెటర్ లో ఏముందంటే...పీవీ నరసింహారావును ఉద్దేశించి రతన్ టాటా ఈ లేఖను చేతితో రాశారు. పీవీ నరసింహా రావు సాధించిన ‘అత్యుత్తమ విజయాలు’’ అని కొనియాడారు. భారతదేశాన్ని గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో ఒక భాగంగా మార్చారంటూ ప్రశంసల జల్లుకురిపించారు. భారత్ కు మీ దూరదృష్టి చాలా సహాయం చేస్తుందంటు తెలిపారు.
‘‘ప్రియమైన ప్రధాని పీవీ నరసింహారావు గారు, ఈ మధ్యకాలంలో మీ నిర్దయ ప్రస్తావనతో ఉన్న కొన్ని రిఫరెన్స్‌లను చదివాను. ఇతరుల జ్ఞాపకాలు చిన్నవి అయ్యిండవచ్చు. కానీ భారతదేశానికి అత్యంత అవసరమైన ఆర్థిక సంస్కరణలను తీసుకురావడంలో మీరు సాధించిన అత్యుత్తమ విజయాన్ని నేను ఎల్లప్పుడూ గుర్తించి, గౌరవిస్తానని మీకు తెలియజేయడానికి ఈ లేఖ రాస్తున్నాను అంటూ తెలిపారు.మాజీ ప్రధాని నరసింహారావును ‘భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు’ అని పిలుస్తుంటారు.
Beautiful writing from a beautiful person…. pic.twitter.com/AOxJPmVqNL — Harsh Goenka (@hvgoenka) October 15, 2024