2022-2023 సీజన్ కు సిధ్దం చేసిన ప్రసాదంలో మోతాదుకి మించి క్రిమిసంహారకాలు ఉన్నట్లు తేలింది. అవును ప్రసాదంలో పురుగులు రాకుండా పురుగుల మందును కలుపుతున్నట్లు న్యాయస్థానం తేల్చింది
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కొన్ని ప్రదేశాలు ప్రసాదాలతోనే ఫేమస్. తిరుమల లడ్డు, అన్నవరం ప్రసాదం, అలా శబరిమల అరవణ ప్రసాదం . అయితే శబరిమల అరవణ ప్రసాదంలో యాలకులతో పాటు క్రిమిసంహారకాలు కూడా ఉన్నాయంటు వార్త వైరల్ అవుతుంది. అయ్యప్ప ప్రసాదం దాదాపు ఏడాది పాటు నిల్వ ఉంటుంది. ఇది అందరికి తెలిసిందే. అయితే 2022-2023 సీజన్ కు సిధ్దం చేసిన ప్రసాదంలో మోతాదుకి మించి క్రిమిసంహారకాలు ఉన్నట్లు తేలింది. అవును ప్రసాదంలో పురుగులు రాకుండా పురుగుల మందును కలుపుతున్నట్లు న్యాయస్థానం తేల్చింది. యాలికులతో పాటు 14 రకాల హానికారక కెమికల్స్ ఉన్నట్లు ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి, అయితే వెంటనే వీటిని డిస్పోజ్ చెయ్యాలని ..జనాలు తింటే క్యాన్సర్లు వస్తాయని తెలిపారు.
ప్రసాదంతో పాటు టిన్స్ డిమాలిష్ ప్రక్రియ బోర్డ్‌కి తలనొప్పి వ్యవహారంగా మారింది. దాదాపు 6.65 లక్షల టిన్స్ ప్రసాదాన్ని ఇప్పుడు డిస్పోజ్ చెయ్యాలి. ఈ ప్రసాదం విలు 5.50 కోట్ల రూపాయిలు. అయితే ప్రసాదాన్ని డిమాలిష్ చేసి దాన్ని ఎరువుగా మార్చడానికి దేవస్థానం బోర్డు టెండర్లు పిలుస్తున్నారు. అయితే ఈ ఆరున్నర కోట్ల విలువైన అరవణ ప్రసాదాన్ని ఎరువుగగా మార్చి కేరళ రైతులకు ఇవ్వాలనే ఆలోచనలో ఉంది.
కేరళ కంపెనీ ఇండియన్ సెంట్రీఫ్యూజ్ ఇంజినీరింగ్ సొల్యూషన్స్ (ఐసీఈఎస్) దక్కించుకుంది. రూ. 1.16 కోట్లకు ఈ కాంట్రాక్ట్ ఫైనల్ అయింది రూ.5.50 కోట్లు విలువైన అరవణ ప్రసాదాన్ని ఎరువుగా మార్చి, రైతుల కోసం వినియోగంలోకి తెస్తామని ఐసీఈఎస్ తెలిపింది. కాగా మెటీరియల్‌ను ఎండబెట్టి, పశుగ్రాసం, ఎరువుగా మార్చడానికి హైదరాబాద్‌కు పంపనున్నారు. ఇదంతా జరగడానికి మనిమమ్ రెండు మూడు నెలల పని అవుతుందని తెలిపారు.