ప్రస్తుతం మార్కెట్ లో ఉన్నటువంటి మొబైల్ కంపెనీలలో సాంసంగ్ మొబైల్ కంపెనీ అద్భుతమైన ఆదరణ పొందింది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే ఎన్నో రకాల వేరియంట్లు వచ్చాయి. అలాంటి
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం మార్కెట్ లో ఉన్నటువంటి మొబైల్ కంపెనీలలో సాంసంగ్ మొబైల్ కంపెనీ అద్భుతమైన ఆదరణ పొందింది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే ఎన్నో రకాల వేరియంట్లు వచ్చాయి. అలాంటి శాంసంగ్ నుంచి తాజాగా మరో మొబైల్ రాబోతోంది. అదే సాంసంగ్ గెలాక్సీ s24fe ఈ ఏడాది ప్రారంభం నుంచే టెక్ మార్కెట్ లో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ప్రీమియం సెగ్మెంట్ విషయానికి వస్తే శాంసంగ్ ఫోన్లు హైలెట్ గా నిలుస్తున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సాంసంగ్ గెలాక్సీ ఎస్24, గెలాక్సీ అల్ట్రా వంటి మొబైల్స్ ఉన్నాయి.
అయితే సాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఎఫ్ ఈ BIS ధ్రువీకరణ పొందినది. త్వరలో ఈ మొబైల్ ఇండియన్ మార్కెట్లోకి రానుందని తెలుస్తోంది. అలాంటి ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలు చూద్దాం. సాంసంగ్ గెలాక్సీ s24 ఎఫ్ఈ అక్టోబర్ లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ మొబైల్ డిజైన్ గెలాక్సీ s24 డిజైన్ తో సమానంగా ఉంటుందట. అయితే ఈ ఫోన్ ఐదు కలర్ వేరియంట్ లో వస్తుందని తెలుస్తోంది. వైట్, బ్లూ, ఎల్లో, గ్రీన్, గ్రాఫైట్, కలర్స్ లో ఉంటుందట. అయితే ఈ మొబైల్ కొన్ని ఫీచర్స్ లీక్ అయ్యాయి. అయితే ఈ ఫోన్ 6.7 అంగుళాల ఎఫ్ హెచ్ డి ప్లస్ డిస్ప్లే 120hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ XCLIPSE 940 GPU కనీసం 8జీబీ ర్యామ్ లింక్ అయి ఉండాలట.
అలాగే ఈ మొబైల్ వెనుక కెమెరా విషయానికొస్తే ట్రిపుల్ లెన్స్ సెటప్ కలిగి ఉంటుంది. ఇక మెయిన్ సెన్సార్ విషయానికి వస్తే 50ఎంపీ షూటర్, దీంతో పాటు 12mp అల్ట్రా వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జామ్ తో కూడిన 8ఎంపి టెలిఫోటో లెన్స్, 10ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉందట. అలాగే ఈ మొబైల్ బ్యాటరీ విషయానికొస్తే 4565 mAh బ్యాటరీతో వస్తోందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 14తో రన్ అవుతుంది. ఇందులో అనేక ఏఐ ఫీచర్లు కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇక ధర ఇతర వివరాలు మాత్రం రిలీజ్ తర్వాతే తెలియనున్నాయి.