సినిమా అతను డైరక్షన్ చెయ్యలేదని ..అంతా శ్రీమాన్ తన అసిస్టెంట్ చేశాడనే ఇంట్రస్టింగ్ విషయాలు తెలిపారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పుష్ప సినిమా సూపర్ డూపర్ హిట్టు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ -సుకుమార్ కాంబోలో తెరకెక్కిన సినిమా పుష్ప-2 బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. అయితే సుకుమార్ ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ చెప్పాడు. సినిమా అతను డైరక్షన్ చెయ్యలేదని ..అంతా శ్రీమాన్ తన అసిస్టెంట్ చేశాడనే ఇంట్రస్టింగ్ విషయాలు తెలిపారు.
సినీ చరిత్రలోనే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే మేకర్స్ శనివారం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన దర్శకుడు సుకుమార్ తన అసిస్టెంట్ డైరక్టర్ శ్రీమాన్ కోసం చాలా గొప్పగా చెప్పాడు.'శ్రీమన్ సగం సినిమా డైరెక్ట్ చేశాడు. నిజంగా తనను మెచ్చుకోవాలి. నా టీమ్‌లో అతను ఎలాంటి కల్మషం లేని వ్యక్తి. సినిమాలో హీరో చిన్ననాటి ఎపిసోడ్, ట్రక్ సీన్ దాదాపు 40శాతం సన్నివేశాలకు శ్రీమనే దర్శకుడు. అయితే డైరెక్టెడ్ బై 'శ్రీమాన్, సుకుమార్' అని వేయాలి. పోరపాటను నా పేరు వేసుకున్నా' అని సుకుమార్ అన్నారు.
అయితే ఇప్పటికే ఇండస్ట్రీ లో బుచ్చిబాబు తో పాటు సుకుమార్ శిష్యులు ఇప్పటికే ఇండస్ట్రీ లోకి రావడం సక్సస్ అవ్వడం జరిగింది. ఇప్పుడు సుకుమార్ శ్రీమాన్ ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడంటున్నారు మూవీ లవర్స్.