sunitha williams: 9 నెలల తర్వాత భూమి మీదకు విలియమ్స్ ..హెల్త్ కండిషన్ ఏంటి !

సునీతా తోపాటు బుచ్ విల్మోర్ కూడా అంతరిక్ష కేంద్రంలోనే ఉన్నారు. వారిద్దరు ఈ నెల 19న భూమి మీదకు వస్తారని నాసా తెలిపింది.


Published Mar 03, 2025 03:52:00 PM
postImages/2025-03-03/1740997415_v7ad483gsunitawilliams640x48025August24.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్:  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునితా విలియమ్స్ చిక్కుకుపోయిన విషయం అందరికి తెలిసిందే. దాదాపు 9 నెలలు గా  అంతరిక్ష కేంద్రంలోనే ఉంటున్నారు. సునీతా తోపాటు బుచ్ విల్మోర్ కూడా అంతరిక్ష కేంద్రంలోనే ఉన్నారు. వారిద్దరు ఈ నెల 19న భూమి మీదకు వస్తారని నాసా తెలిపింది.


ఇందుకుగానూ నాసా, స్పేస్‌ ఎక్స్ చేపట్టిన క్రూ-9 మిషన్‌ను ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపారు. దీని ద్వారానే సునితా విలియమ్స్ , బుచ్ విల్మోర్ భూమి మీదకు రానున్నారు. క్రూ-9 సిబ్బందిని రిలీవ్ చేసేందుకు వెళ్లే క్రూ-10 ప్రయోగం ఈ నెల 12న జరగనుంది. మైక్రోగ్రావిటీ ఉండే పరిసరాలలో సునీతా విలియమ్స్‌ తొమ్మిది నెలలుగా ఉంటుండడంతో ఆమెకు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్స్ లో సునితా విలియమ్స్ ..తీవ్రమైన ఎముకల సాంద్రత తగ్గింది. అలాగే కంటిసమస్యలు , శారీరంలో బలహీనతతో ఆమె బాధపడుతున్నట్లు తెలిసింది. మానసిక సమస్యలు ఎదురయ్యే ముప్పు ఉంటుంది. 


చాలా కాలం మైక్రోగ్రావిటీకి గురైనప్పుడు కండరాలు బరువును భరించలేవు. దీంతో కండరాల బలహీనతకు ఇది దారితీస్తుంది. కాళ్లు, తొడల వెనుక భాగం వంటి భాగాల్లో ఈ సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు ఎముకలు ఫ్రాక్చర్లు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.న్యూరోవెస్టిబ్యులర్ సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. సునీతా విలియమ్స్ కంటి సంబంధించి కూడా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nasa space-center

Related Articles