Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధర..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78,820 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,160 పలుకుతోంది. గ్రాము మీద 200 పెరిగింది.


Published Oct 18, 2024 12:32:00 PM
postImages/2024-10-18/1729234982_goldprice16001727916429.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మళ్లీ పెరిగిన బంగారం ధర మళ్లీ పెరిగాయి. రోజు పెరగడం , తగ్గడం చాలా కామన్ కాని  ఈ రోజు గోల్డ్ రేటు స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78,820 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,160 పలుకుతోంది. గ్రాము మీద 200 పెరిగింది.


బంగారం ధర గడిచిన మూడు నెలల్లో ఏకంగా 13 వేల రూపాయలు పెరిగింది. జూలై నెలలో బంగారం ధర చివరిసారిగా 67 వేల రూపాయల వద్దకు కనిష్ట స్థాయిని తాకింది. వారం రోజుల్లో దాదాపు 2  వేల రూపాయిల పైనే పెరిగింది. ఇక నుంచి బంగారం రూపాయి పెరిగినా అది రికార్డు స్థాయి పెరిగినట్లే.ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం కారణంగా వరుసగా పెరుగుతున్నాయి. ప్రపంచ వాణిజ్యం ఈ యుద్ధ వాతావరణం వల్ల దెబ్బ తింటుందని మదుపుదారులు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తున్నారు. 


 దీనికి తోడు ఈ నెల చివరలో ధన త్రయోదశి పండుగ ఉంది. ఈ పండగ సందర్భంగా పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఆభరణాలు కొనుగోలు చేసే వారికి పెరిగిన బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే భవిష్యత్తులో బంగారం ధర తగ్గుతుందా అనేది ఇప్పట్లో ఆలోచించేలా లేదు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business goldrates silver-rate

Related Articles