AMARAN: అమరన్ నుంచి క్రేజీ అప్ డేట్.. సెకండ్ సాంగ్ ట్రాక్ లాంచ్ !

సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమరన్ లో సాయిపల్లవి మేజర్ ముకుంద్ సతీమణి ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో యాక్ట్ చేస్తుంది.


Published Oct 17, 2024 09:19:00 PM
postImages/2024-10-17/1729180268_hq720.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ :  కోలీవుడ్ స్టార్ యాక్లర్లు శివకార్తీకేయన్ సినిమా అమరన్ నుంచి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మూవీటీం. SK 21 గా వస్తున్న ఈ మూవీకి రాజ్ కుమార్ పెరియసామి డైరక్టర్ . సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమరన్ లో సాయిపల్లవి మేజర్ ముకుంద్ సతీమణి ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో యాక్ట్ చేస్తుంది.


ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ హే రంగులే సాంగ్‌ను విడుదల చేయగా.. నెట్టింట మ్యూజిక్‌ లవర్స్‌ను ఇంప్రెస్‌ చేస్తోంది. ఇప్పుడు మరో సెకండ్ సింగిల్ వెన్నెలవే  అంటూ సెకండ్ సాంగ్ ను లాంచ్ చేశారు. యుగభారతి రాసిన  ఈ పాటను జీవీ ప్రకాశ్ కంపోజ్ చేశారు. కపిల్ కపిలన్ , రక్షిత సురేశ్ పాడారు. ఫ్యామిలీ జర్నీతో సాగే ఈ పాట ఆడియన్స్ కు చాలా బాగా కనెక్ట్ అవుతుందంటున్నారు మూవీ టీం.


మరోవైపు మేకర్స్‌ రెబెకా వర్గీస్‌ పాత్రకు సంబంధించిన ఇంట్రడక్షన్‌ వీడియోను షేర్ చేయగా.. సాయిపల్లవి రెబెకా వర్గీస్‌ పాత్రలో జీవించేసిందని అర్థమవుతోంది. ఈ మూవీలో విశ్వరూపం ఫేం రాహుల్ బోస్‌ (RahulBose) విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా చాలా వరకు కాశ్మీర్ లో షూట్ చేశారు. సాయిపల్లవి హీరోయిన్ అనగానే సినిమా పై చాలా అంచనాలున్నాయి. 

 

newsline-whatsapp-channel
Tags : movies movie-news jawan tamilnadu saipallavi

Related Articles