కివీస్ బౌలర్ల విజృంభణతో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌట్ అయింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: న్యూజిలాండ్ జట్ల మధ్య బెంగుళూరులో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట కంప్లీట్ అయ్యింది. బెంగుళూరు లో జరుగుతున్న ఈ తొలి టెస్టులో రెండో రోజు ఆట చాలా ఎగ్జైటింగ్ గా జరిగింది. ఫస్ట్ రోజు ఆట పూర్తిగా వర్షం తో రెండో రోజు ఆట ఉదయంటాస్ టీమిండియా బ్యాటింగ్ తో మొదలుపెట్టింది.కివీస్ బౌలర్ల విజృంభణతో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌట్ అయింది.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ప్రస్తుతం కివీస్ ఆధిక్యం 134 పరుగులు. అంతేకాదు రచిన్ రవీంద్ర22, డారిల్ మిచెల్ 14 పరుగులతో క్రీజులోనే ఉన్నారు. అంతేకాదు కివీస్ ఇండియాను చిత్తు చిత్తుగా ఓడించింది.
అంతకుముందు, కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే సెంచరీ చేజార్చుకున్నాడు. 105 బంతులు ఎదుర్కొన్న కాన్వే 11 ఫోర్లు, 3 సిక్సులతో 91 పరుగులు చేశాడు. కెప్టెన్ టామ్ లాథమ్ 15, విల్ యంగ్ 33 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 1, కుల్దీప్ యాదవ్ 1, జడేజా 1 వికెట్ తీశారు. దీంతో ఇండియా మీద కివీస్ విజయం సాధించింది.