Crocodiles: వామ్మో.. తెల్లపులి, మొసళ్లను తరలిస్తున్న వ్యాన్ బోల్తా..పరిస్థితి చూడాలి !

రెండు వెహికల్స్ లో అరుదైన తెల్లపులి, మొసళ్లను తరలిస్తున్న వాహనం బోల్తా పడింది. బెంగుళూరులోని బన్నేరుఘట్ట జాతీయ పార్క్ కు రతలిస్తున్నారు. 


Published Oct 17, 2024 06:48:00 PM
postImages/2024-10-17/1729171124_CrocodiletigersVjpg442x2604g.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బీహార్ రాజధాని పాట్నాలోని సంజయ్ గాంధీ జాతీయ పార్క్ నుంచి రెండు వెహికల్స్ లో అరుదైన తెల్లపులి, మొసళ్లను తరలిస్తున్న వాహనం బోల్తా పడింది. బెంగుళూరులోని బన్నేరుఘట్ట జాతీయ పార్క్ కు రతలిస్తున్నారు. 


   బీహార్ రాజధాని పాట్నాలోని సంజయ్‌గాంధీ జాతీయ పార్క్ నుంచి రెండు వాహనాల్లో అరుదైన తెల్లపులి, మొసళ్లను తరలిస్తున్న వాహనం బోల్తాపడింది. బెంగళూరులోని బన్నేరుఘట్ట జాతీయ జూపార్క్‌కు వెళ్తున్న వాహనాల్లో ఒకటి తెలంగాణలోని నిర్మల్ జిల్లా మామడ మండలం మొండిగుట్ట గ్రామం వద్ద నిన్న అదుపుతప్పి బోల్తాపడింది. 


ఇక చూస్కో లోపల ఉన్న వాహనం లో జంతువులన్నీ రోడ్లపై రావడానిి ప్రయత్నించాయి. వెహికల్ లో ఉన్న 8 మొసళ్లల రెండు మొసళ్లు అదుపు తప్పి బయటకు వచ్చే ప్రయత్నం చేశాయి. అదిచూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్థానిక అటవీశాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని మొసళ్లను బంధించారు. మరో వాహనాన్ని సిధ్ధం చేసి బెంగుళూరు కు తరలించారు.  కాని జనాలు  ఓ అరగంట పాటు రోడ్లపై ఫుల్ హై టెన్షన్ నడిచింది.
 

newsline-whatsapp-channel
Tags : india-people newslinetelugu crocodile banguluru

Related Articles