INDIA: స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు...ఇంకా పేదరికంలోనే మగ్గుతున్న ప్రజలు !

2024 నాటికి దేశంలో మొత్తం 12.9 కోట్లమంది అత్యంత పేదరికంలో ఉన్నట్టు తెలిపింది. దీనిని బట్టి భారత్ ఇంకా చాలా దీన స్థితిలోనే ఉందని సర్వేలు చెబుతున్నాయని క్లారిటీ ఇచ్చారు.


Published Oct 17, 2024 11:34:38 AM
postImages/2024-10-17/1729182733_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  భారత్ చాలా ధనిక దేశమని మనకు తెలిసిన చరిత్ర. కాని  బ్రిటిష్ వాళ్లు వచ్చాక భారత్ సంపద ..ఖండాంతరాలు దాటిందనేది మనకు తెలిసిన విషయం . కాని బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోయి ...మన దేశానికి స్వతంత్యం వచ్చి దాదాపు 75 ఏండ్లు అవుతుంది.  అయినా ఇంకా భారత్ లో కూటికి కష్టపడే వాళ్లు చాలా మంది ఉన్నారని తెలిపుతుంది సర్వేలు.


దేశంలోని 142 కోట్ల మంది జనాభాలో 9 శాతం మందికిపైగా ప్రజలు కటిక పేదరికంలో మగ్గుతున్నట్టు వరల్డ్ బ్యాంక్ తాజా నివేదికలో వెల్లడించింది. 2024 నాటికి దేశంలో మొత్తం 12.9 కోట్లమంది అత్యంత పేదరికంలో ఉన్నట్టు తెలిపింది. దీనిని బట్టి భారత్ ఇంకా చాలా దీన స్థితిలోనే ఉందని సర్వేలు చెబుతున్నాయని క్లారిటీ ఇచ్చారు.


జనాభాపరంగా చూస్తే 1990 లో కంటే 2024లోనే అత్యధిక మంది దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారని పేర్కొన్నది. పేదరికానికి జనాభా పెరుగుదలే ప్రధాన కారణమని వెల్లడించింది. ప్రస్తుత దేశ పురోగతిని చూస్తే.. అత్యంత పేదరికాన్ని నిర్మూలించేందుకు ఇంకా దశాబ్దాల కాలం పడుతుందని తెలిపింది. ఇందులో చాలా మంది ప్రజలు రోజు సంపాదన దాదాపు రూ.121 కంటే తక్కువగానే ఉందని ఈ సర్వే ద్వారా తెలుస్తుంది. ఈ సర్వేలు చూసిన నెటిజన్లు మాత్రం ఇంత దారుణంగా ఉంటే ఎప్పటికి భారత్ అభివృధ్ధి చెందిన దేశంగా మారాలంటు కామెంట్లు పెడుతున్నారు.
 

newsline-whatsapp-channel
Tags : india-people newslinetelugu below-poverty

Related Articles