భారత మూలాలున్న కమలాహారిస్ గెలుస్తారని అందరు అనుకున్నారు..కాని ట్రంప్ గెలిచి మార్కెట్ ను షేక్ చేశారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: గోల్డ్ కోనాలనుకునే ఉద్దేశ్యం ఉంటే ...ఇప్పుడే కొనేయండి. బంగారం ధరలు ప్రస్తుతం భారీగా తగ్గాయి. ట్రంప్ గెలవడంతో ప్రపంచ మార్కెట్లో చాలా రంగాల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా రోజు రోజుకూ పెరుగుతూ ఉన్న గోల్డ్ రే్ట్లు ఒక్కసారిగా తగ్గాయి. భారత మూలాలున్న కమలాహారిస్ గెలుస్తారని అందరు అనుకున్నారు..కాని ట్రంప్ గెలిచి మార్కెట్ ను షేక్ చేశారు.
తగ్గిన ధరల ప్రకారం 10 గ్రాముల బంగారం రూ.500 తగ్గి రూ.78,100కి పడిపోయింది. వెండి ధరలు కూడా రూ.94,261 నుంచి రూ.92,000లకు పడిపోయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్రంప్ మొదటి ప్రసంగం చేశారు. ఆ తర్వాత నుంచి గోల్డ్ ధరలు తగ్గడం ప్రారంభించాయి. నిన్న బంగారం 2 వేల పైనే తగ్గింది. ఇప్పుడే బంగారం ధర తగ్గొచ్చు. కాబట్టి కొనాలనుకుంటే ఈ రోజే కొనండి. ఇంతకంటే బంగారం తగ్గే అవకాశమే లేదంటున్నారు మార్కెట్ల ఎనలిస్ట్ లు.
ఢిల్లీలో 24k బంగారం ధర 10 గ్రాములకు రూ.1,790 తగ్గింది. ప్రస్తుతం రూ.78,710కి ధర ఉంది. 22k బంగారం ధరలు రూ.1,650 తగ్గాయి. 10 గ్రాములకు రూ.72,150కి బంగారం ధర ఉంది. గ్లోబల్ ఫ్రంట్‌లో, బంగారం ధరలు మూడు వారాల కంటే తక్కువ స్థాయికి పడిపోయాయి. దీపావళిలో పోలిస్తే బంరం ధర దాదాపు 8 వేల పైనే తగ్గింది. దాదాపు తెలుగు రాష్ట్రాలన్నింటిలోను ఇదే ధర నడుస్తుంది.