gold: స్వల్పంగా పెరిగిన బంగారం ధర- ఇప్పుడు గ్రాము ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధర దాదాపు లక్ష నడుస్తుంది. 


Published Nov 27, 2024 10:49:00 AM
postImages/2024-11-27/1732684794_goldjewellery21721367589.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : దేశంలో బంగారం , వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర 78,000 ఉంది.  బుధవారం నాటికి రూ.270 పెరిగింది..ఇప్పుడు 78270 గా నడుస్తుంది. దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం ఫ్లాట్ రోజును ప్రారంభించాయి. చైనా, కెనడా, మెక్సికోలపై కొత్త సుంకాలు విధిస్తామని అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించడంతో ఇన్వస్టర్లు కాస్త జాగ్రత్తపడుతున్నారు.తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధర దాదాపు లక్ష నడుస్తుంది. 


డిసెంబర్​ తరువాత అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ఏర్పడనుంది. కనుక ట్రంప్ ప్రభుత్వం తీసుకునే పరిపాలనాపరమైన నిర్ణయాలు, ప్రవేశ పెట్టే పాలసీలను బట్టి, బులియన్ మార్కెట్ ట్రెండ్ మారుతుంది. కనుక ఏం జరుగుతుందో కాస్త వేచి చూడాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.


నిజానికి ట్రంప్ వచ్చిన తర్వాత ...బంగారం ధర తగ్గుుతందని అంచనా వేశారు. ట్రంప్ ప్రభుత్వం పెట్టుబడులకు కాస్త మొగ్గు చూపిస్తారు. కాబట్టి పెట్టుబడులు బంగారం మీదే కాకుండా మిగిలిన వాటి పై కూడా పెట్టుబడులు పెడతారు. అప్పుడు బంగారం తగ్గుతుంది. సో కుదిరితే కొన్ని రోజులు వెయిట్ చెయ్యండి. రేటు తగ్గుతుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business goldrates silver-rate stock-market

Related Articles