కులశేఖర్ ఈ రోజు తుది శ్వాస విడిచారు. పాటల రచయితగా ఓ వెలుగు వెలిగిన ఆయన తర్వాత మానసికంగా కుంగిపోయారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టాలీవుడ్ లిరిక్ రైటర్ కులశేఖర్ (53) హైదరాబాద్ లో గాంధీ హాస్పటిల్ లో కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగం తో బాధపడుతున్న కులశేఖర్ ఈ రోజు తుది శ్వాస విడిచారు. పాటల రచయితగా ఓ వెలుగు వెలిగిన ఆయన తర్వాత మానసికంగా కుంగిపోయారు.
విశాఖపట్నంకు చెందిన కులశేఖర్ మొదట హైదరాబాద్‌లో జర్నలిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత లిరిక్ రైటర్‌గా మారారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి వద్ద శిష్యరికం చేయడం ద్వారా సినిమా పాటలు బాగా రాసేవారు. ప్రముఖ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన ‘చిత్రం’ సినిమా ద్వారా పాటల రచయితగా పరిచయమయ్యారు.
ఆ తర్వాత 'జయం', 'నువ్వు నేను', 'భద్ర', 'సంతోషం', 'ఔనన్నా కాదన్నా', 'వసంతం', 'రామ్మా చిలకమ్మా', 'వసంతం', 'మృగరాజు', 'సుబ్బు', 'సైనికుడు' వంటి చిత్రాల్లో సూపర్‌హిట్ పాటలు రాశారు. కాని ఎందుకో సడన్ గా మంచి ఫామ్ లో ఉన్నపుడే మానసిక ఇబ్బందులు రావడం మొదలయ్యాయి . చిన్న చిన్న దొంగతనాలు చేసినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. చాలా సార్లు జైలుకి కూడా వెళ్లారు.కులశేఖర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చాలా రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన ఈ రోజు చనిపోయారు.