Akhil Akkineni Engagement: అఖిల్ ఎంగేజ్‌మెంట్.. అనౌన్స్ చేసిన నాగార్జున !

"మా కొడుకు అక్కినేని అఖిల్, మా కాబోయే కోడలు జైనా రౌజీ నిశ్చితార్థం జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నామంటూ ట్వీట్ చేశారు.


Published Nov 26, 2024 10:39:00 PM
postImages/2024-11-26/1732640988_akhilakkineni26272250216x90.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: అఖిల్ అక్కినేని నిశ్చితార్థం మంగళవారం జరిగింది. నాగార్జున ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు. ఈ మధ్యే నాగచైతన్య , శోభిత నిశ్చితార్ధం కూడా జరిగింది. ఇప్పుడు అఖిల్ నిశ్చితార్దం ..జరిగింది. "మా కొడుకు అక్కినేని అఖిల్, మా కాబోయే కోడలు జైనా రౌజీ నిశ్చితార్థం జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నామంటూ ట్వీట్ చేశారు.


జైనాబ్ ను మా కుటుంబంలోకి ఆహ్వానించడం చాలా థ్రిల్లింగా ఉంది. ఈ జంటవైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. జైనాబ్ కూడా ఓ ఆర్టిస్ట్ . అఖిల్ ఆమెతో రెండేళ్ల నుంచి ప్రేమలో ఉన్నాడట. ఇప్పడు పెళ్లి చేసుకుంటున్నారు. డేట్ అనౌన్స్ చెయ్యలేదు కాని  అతి త్వరలో చేసేస్తారని మాత్రం ఇండస్ట్రీ టాక్.


నిజానికి అఖిల్ అక్కినేనికి ఇది రెండో నిశ్చితార్థం. మొదటిసారి 2017లో శ్రియ భూపాల్ అనే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ జరిగింది. కానీ అది పెళ్లి వరకూ వెళ్లలేదు. ఇటలీలో చాలా ఘనంగా వీళ్ల పెళ్లి జరిపించాలని అనుకున్నారు. ఎందుకో వర్కువట్ కాలేదు ..లైట్ తీసుకున్నారు. ఇప్పుడు జైనబ్ తో పెళ్లి అఖిల్ కు కలిసి రావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.ప్రస్తుతం రెండు కొత్త సినిమాలను సైన్ చేశాడు. వచ్చే ఏడాది వీటి షూటింగ్ మొదలు కానుంది. అకిల్ నెక్ట్స్ మూవీ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు.. ఈ ఎంగేజ్‌మెంట్ సడెన్ సర్‌ప్రైజ్ అని చెప్పొచ్చు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu akhil-akkineni engagement

Related Articles