జియో రీఛార్జ్ లు పెంచడంపై సాధారణ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. అందుకే లో బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్స్ పరిచయం చేసింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టెలికాం రంగం లో జియో కు పరిచయాలు అక్కర్లేదు. కోట్ల మంది కస్టమర్లు ...ఎన్నో టెలికాం సంస్థలను ..క్లీన్ స్వీప్ చేసేసింది. ఫ్రీ సిమ్ కార్డ్ ఇస్తూ ఉచిత డేటా, కాలింగ్ సదుపాయం కల్పిస్తూ మిగతా టెలికాం కంపెనీలకు గట్టి పోటీఇచ్చింది. రీసెంట్ గా జియో రీఛార్జ్ లు పెంచడంపై సాధారణ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. అందుకే లో బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్స్ పరిచయం చేసింది.
కేవలం రూ. 11తో రీచార్జ్ చేసుకుంటే చాలు అదిరే బెనిఫిట్ పొందొచ్చు. 11 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే 10 జీబీ 4జీ డేటా అందిస్తోంది.అయితే వ్యాలిడిటీ జస్ట్ ఒక గంట మాత్రమే . రాఛార్జ్ చేసుకున్న గంట తర్వాత డేటా స్పీడ్ 64 కేబీపీఎస్ కు తగ్గిపోతుంది. అయితే ఈ ఆఫర్ జస్ట్ నెట్ కు మాత్రమే .వాయిస్ కాల్స్ కాని ఎస్ ఎంఎస్ సర్వీసులు కాని అందించదు.
నిర్ణీత సమయంపాటు హైస్పీడ్ డేటా అవసరమయ్యేవారికి ఈ ఆఫర్ ఎంతో ఉపయోగమని కంపెనీ తెలిపింది. లార్జ్ ఫైల్స్ లేదా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, డౌన్‌లోడ్ చేయాలనుకొనేవారికి ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుందని జియో తెలిపింది. కొత్త ప్లాన్ యూత్ కు , ఆఫీసుల్లో అర్జెంట్ పనుల్లో ఈ ఆఫర్ చాలా బాగా పనిచేస్తుంది.