గత సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మెప్పించింది. శోభా శెట్టితో కలిసి ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ చిక్కుల్లో పడింది. తన బాయ్ ఫ్రెండ్ తో టీటీడీ మెట్ల ప్రయాణంలో ఓ చిన్న ప్రాంక్ చేసి హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారంటూ చీవాట్లు తింటుంది. గత సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మెప్పించింది. శోభా శెట్టితో కలిసి ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
ప్రియాంక జైన్ కి లవర్ నటుడు శివతో ఆమె డేటింగ్లో ఉంది. అధికారికంగానే ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారు. పెళ్లికి కూడా రెడీ అవుతున్నారు. తన యూట్యూబ్ ఛానెల్లో, కామెడీ వీడియోలతో ఆకట్టుకుంటున్నారు. ఈ కామెడీ వీడియోనే ప్రియాంకను ఇప్పుడు బ్యాడ్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానంపై ఓ వీడియో చేశారు. తిరుమల అలిపిరి మెట్లపై నుంచి శ్రీవారికి వెళ్తూ చిరుత ఉందంటూ ప్రాంక్ చేశారు. కాని చిరుత మాపై అటాక్ చేయబోయిందంటూ తంబ్ నెయిల్ పెట్టి యూట్యూబ్లో అప్ లోడ్ చేశారు.వీడియో చివర్లో చిరుత లేదు ఏం లేదు అంతా ప్రాంక్ ఉసూరు మనిపించారు. ఈ వీడియో 8 నెలల క్రితం వీడియో..ఇప్పుడు వైరల్ అయ్యి టీటీడీ చేతికి ఇప్పుడు చిక్కింది.టీటీడీ పాలకమండలి సభ్యుడు, బీజేపీ నాయకుడు భాను ప్రకాష్ రెడ్డి స్పందించారు. పవిత్రమైన గుడిలో ఇలాంటి పనులు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మీ సరదాల కోసం దేవాలయ నియమాలు మరిచిపోతే ..కేసులు పెట్టాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.