gold: భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే?

బంగారం ఈ రోజు తగ్గుముఖం పట్టింది. గురువారంతో పోల్చితే నేటి ధరలు గరిష్ట స్థాయికి తగ్గాయి. వెండి మాత్రం స్థిరంగా ఉన్నాయి.


Published Aug 23, 2024 08:43:00 AM
postImages/2024-08-23/1724382867_gold.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ఆషాడం ముగిసి శ్రావణ మాసం మొదలైంది. అమ్మవారి పూజలు, బంగారం కొంటూ ఉంటారు. పెళ్లిళ్లకు పసిడి కొనుగోలు చేయడం జరుగుతుంది. బంగారం ఈ రోజు తగ్గుముఖం పట్టింది. గురువారంతో పోల్చితే నేటి ధరలు గరిష్ట స్థాయికి తగ్గాయి. వెండి మాత్రం స్థిరంగా ఉన్నాయి.


దేశంలో బులియన్ మార్కెట్లో 22 క్యారట్ల 10 గ్రాముల గోల్డ్ రేటుపై రూ .400 తగ్గింది. ఈ వారంలో ఇదే గరిష్ట తగ్గుదల. ఇన్ని రోజులు 10,20 తగ్గుతుంది.22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు పై రూ.400 తగ్గి,రూ. 66,940 వద్ద ఉండగా. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు పై రూ.400 తగ్గి, రూ73,360 కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 66,940 వద్ద ఉండగా. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ73,360 వద్ద కొనసాగుతుంది.


* దేశ రాజధాని ఢిల్లీ లో 22 క్యారెట్లు ..10 గ్రాములు 66,940 వద్ద ఉండగా 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 73,360 రూపాయిలు.


*ముంబై, బెంగుళూరు,కోల్‌కొతా, కేరళా, పూణే లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,790 , 24 క్యారెట్ల రూ.72,860 గా మార్కెట్ ధర నడుస్తుంది.


తెలుగురాష్ట్రాల్లో వెండి ధర కిలో వెండి  రూ. 92,080 ఉంది.  ముంబై, ఢిల్లీ, కోల్‌కొతా, కేరళాలో కిలో వెండి ధర రూ.85,080 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు లో రూ. 83,930, చెన్నైలో కిలో వెండి ధర రూ. 84,120 వద్ద కొనసాగుతుంది. చెన్నై లో మాత్రమే ఈ రోజు వెండి ధర తక్కువగా ఉంది. ఎక్కువ మొత్తంలో కొనే వారు చెన్నై మంచి ఆప్షన్.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business goldrates silver-rate

Related Articles