ప్రభుత్వం పట్టించుకోకపోతే నాళాలు ఉప్పొంగి వరద ఇళ్లలోకి వచ్చేస్తుందని తెలిపారు. అదే జరిగితే ఘోరమైన ప్రమాదం జరిగే అవకాశం ఉందని వివేకానంద్ హెచ్చరించారు.
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత GHMC నిద్రావస్థలో ఉందని BRS నేత, ఖుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ గౌడ్ అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పతనావస్థకు చేరిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి కేటాయించిన బడ్జెట్ సరిపోదని ఆయన వెల్లడించారు. గతంలో BRS అధికారంలో ఉన్న సమయంలో చాలా కాలనీలను వరద ముంపు నుంచి కాపాడగలిగామని గుర్తుచేశారు. ప్రస్తుతం 17 ప్రాంతాలు డేంజర్ జోన్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు.
కొత్త ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. ఇకనైనా పనులపైన దృష్టి పెడితే బాగుంటుందని సూచించారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే నాళాలు ఉప్పొంగి వరద ఇళ్లలోకి వచ్చేస్తుందని తెలిపారు. అదే జరిగితే ఘోరమైన ప్రమాదం జరిగే అవకాశం ఉందని వివేకానంద్ హెచ్చరించారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు లేవంటే.. గత BRS ప్రభుత్వమే కారణమని ఆయన అన్నారు. అప్పుడు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన తెలిపారు.
అధికారంలో ఉన్నప్పుడు 36 ప్రాజెక్టులను పూర్తి చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి తెలియాలంటే మంత్రులు నగరంలో తిరగాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తున్నామని చెప్పారు. కానీ, అది కనిపించడం లేదని అన్నారు. హైడ్రాను సెంట్రల్ చేస్తే ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు.