రీసెంట్ గా రాబిన్ హుడ్ లో ఫార్నర్ ఎంట్రీకి సంబంధించిన మేకర్స్ ఒక ఇంట్రో వీడియో రిలీజ్ చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : నితిన్ , శ్రీలీల జంటగా వచ్చిన యాక్షన్ ఎంటర్టనర్ మూవీ రాబిన్ హుడ్ . రీసెంట్ గా ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ డేవిడ్ వార్నర్ ఇందులో ఓ గెస్ట్ రోల్ చేస్తున్నారు. రీసెంట్ గా రాబిన్ హుడ్ లో ఫార్నర్ ఎంట్రీకి సంబంధించిన మేకర్స్ ఒక ఇంట్రో వీడియో రిలీజ్ చేశారు.
వార్నర్ ఒక డాన్ లా వ్యవహరించడం ఇందులో చూడొచ్చు. వార్నర్ క్యారక్టర్ పేరు డేవిడ్ భాయ్ . చేతిలో తుపాకీ , చుట్టూ బికినీ గర్ల్స్ ..లగ్జరీ బోట్ పై ఎంజాయ్ చెయ్యడం , హెలీకాప్టర్ జర్నీలు ఇలా చాలా ఇంట్రో వీడియోస్ ను వార్నర్ రోల్ రిచ్ గా కనిపించనున్నాయి. చివర్లో మరో వ్యక్తిని నీకు లాలీపాప్ కావాలా అని వార్నర్ అడగడం నాకొద్దు అని ఆ వ్యక్తి తల అడ్డంగా ఊపడం సీన్ కట్ చేస్తే ఆ వ్యక్తి చచ్చిపడి ఉండగా అతడి నోట్లో లాలీపాప్ పెట్టిన వార్నర్ .."లాలీపాప్స్ ఆర్ రెడ్... ఎనిమీస్ ఆర్ డెడ్" అని డైలాగ్ చెప్పడం అలరిస్తుంది.