Nag Ashwin: నాగ్ అశ్విన్ సెంటిమెంట్ హీరోయిన్.. ఈమె ఉంటే హిట్టు పక్కా..! 2024-06-27 12:20:59

న్యూస్ లైన్ డెస్క్: బయట సమాజంలో. చాలామంది తమకు సంబంధించి ఒక సెంటిమెంట్ అనేది ఫాలో అవుతూ ఉంటారు. అయితే వాళ్లకు ఏ విషయంలో అయితే ఎక్కువగా కలిసి వస్తుందో దాన్నే ఎక్కువ సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు. ఇక ఇవి రాజకీయ నాయకులకి,సినీ ఇండస్ట్రీ వాళ్లకు ఎక్కువగా సూట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే పొలిటీషియన్స్, సీని సెలబ్రిటీలు ఎక్కువగా సెంటిమెంట్ ని,జాతకాలను ఫాలో అవుతూ ఉంటారు. అయితే తాజాగా విడుదలైన పాన్ ఇండియా మూవీ కల్కి సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఒక సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఉంటారట  ఇక ఆ సెంటిమెంట్ ఏంటంటే..

తన ప్రతి సినిమాలో ఓ హీరోయిన్ ఉండడం.. మరి ఇంతకీ నాగ్ అశ్విన్ మెచ్చిన ఆ సెంటిమెంట్ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దామా.. అశ్విని దత్ అల్లుడు నాగ్ అశ్విన్ డైరెక్టర్ గా ఇప్పటివరకు మూడు సినిమాలను తెరకెక్కించారు. అందులో మొదటిది  ఎవడే సుబ్రహ్మణ్యం,రెండవది మహానటి,మూడవది తాజాగా విడుదలైన కల్కి 2898 ఏడి మూవీ.అయితే ఈ మూడు సినిమాల్లో ఓ హీరోయిన్ మాత్రం కామన్ గా ఉంటూ వస్తుంది.ఇక ఈ హీరోయిన్ చేసిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్. ఇక మూడో సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక కల్కి సినిమా ఫైనల్ టాక్ రావాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇప్పటివరకైతే సూపర్ హిట్టే.

ఇక నాగ్ అశ్విన్ సెంటిమెంట్ హీరోయిన్  ఎవరంటే హీరోయిన్ మాళవిక నాయర్.. ఈనటి అందరికీ తెలిసే ఉంటుంది. ఈమె  ఎవడే సుబ్రహ్మణ్యం మూవీలో నానికి జతగా నటించింది.అలాగే ఈ మూవీలో మరో నటి సురభి కూడా చేసింది.ఇక రెండో మూవీ మహానటిలో జెమినీ గణేషన్ పాత్రలో చేసిన దుల్కర్ సల్మాన్ మొదటి భార్య అలివేలు పాత్రలో మాళవిక నాయర్ నటించింది.ఇక తాజాగా విడుదలైన కల్కిలో కూడా మాళవిక నాయర్ ఉంది.అలా మాళవిక ఇంతకు ముందు నటించిన రెండు సినిమాలు హిట్ అవ్వడంతో కల్కి కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అని,నాగ్ అశ్విన్ కి ఈమె సెంటిమెంట్ హీరోయిన్ గా మారిపోతుంది అంటూ కొంతమంది జనాలు కామెంట్లు పెడుతున్నారు