స్టార్ హీరోలే కుళ్ళుకునేలా నటి వంటలక్క కొడుకు..మామూలు కటౌట్ కాదు.!

వంటలక్క  ఈ పేరు చెప్పగానే చాలామంది గుర్తుకు వచ్చేది కార్తీకదీపం సీరియల్. ఈ ధారావాహికలో వంటలక్కకు మొత్తం కష్టాలే. ఆమె ఇబ్బందులు చూడలేక సీరియల్ చూసేవారు కన్నీరు పెడుతూ ఉంటారు.  అలాంటి కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం ముగిసిపోయింది. ప్రస్తుతం కార్తీకదీపం 2 సీరియల్ నడుస్తోంది. కానీ ఈ సీరియల్ ఇంతలా పాపులారిటీ పొందడానికి ప్రధాన కారకురాలు  వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్. ఈమెకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ కి ఏ విధంగా ఫాలోయింగ్ ఉంటుందో అంతటి ఫాలోయింగ్ ఉంది. బుల్లితెర పైనే కాదు ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.  


Published Jul 10, 2024 05:13:03 AM
postImages/2024-07-10/1720597012_vanta.jpg

న్యూస్ లైన్ డెస్క్: వంటలక్క  ఈ పేరు చెప్పగానే చాలామంది గుర్తుకు వచ్చేది కార్తీకదీపం సీరియల్. ఈ ధారావాహికలో వంటలక్కకు మొత్తం కష్టాలే. ఆమె ఇబ్బందులు చూడలేక సీరియల్ చూసేవారు కన్నీరు పెడుతూ ఉంటారు.  అలాంటి కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం ముగిసిపోయింది. ప్రస్తుతం కార్తీకదీపం 2 సీరియల్ నడుస్తోంది. కానీ ఈ సీరియల్ ఇంతలా పాపులారిటీ పొందడానికి ప్రధాన కారకురాలు  వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్. ఈమెకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ కి ఏ విధంగా ఫాలోయింగ్ ఉంటుందో అంతటి ఫాలోయింగ్ ఉంది. బుల్లితెర పైనే కాదు ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.  

తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది.  అలాంటి వంటలక్క తాజాగా తన కొడుకును పరిచయం చేసింది.  కొడుకుతో కలిసి రీల్ చేసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇది చూసినటువంటి నెటిజన్లు  ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. కేరళకు చెందినటువంటి ప్రేమీ విశ్వనాథ్  వినీత్ బట్ అనే ఆస్ట్రాలజర్ ను వివాహం చేసుకుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manujith (@_.maaaaaaaanu)

వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. అతని పేరే మనుజిత్. తాజాగా ఆయన తల్లితో కలిసి ఒక రీల్ చేశారు. వంటలక్క తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో  తన కొడుకుని చూసి అంతా షాక్ అవుతున్నారు. మనిజిత్ తక్కువలో తక్కువ ప్రభాస్ అంత కటౌట్ తో ఉన్నారు. సాధారణ హీరోలైతే ఆయన ముందు తుడిచిపెట్టుకుపోవాల్సిందే.

అద్భుతమైన సిక్స్ ప్యాక్ బాడీతో,  కండల వీరుడిలా కనిపిస్తున్నాడు. వయసు చిన్నగానే కనిపించినా, కానీ  స్టార్ హీరోలు చూస్తే కుళ్ళుకునే విధంగా  కటౌట్ మైంటైన్ చేస్తున్నాడని చెప్పవచ్చు. అసలు ఆ వ్యక్తి వంటలక్క కొడుకు అంటే నమ్మడానికి కూడా లేని విధంగా  ఉన్నాడు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu karthika-deepam premi-vishwanath manugeeth vantalakka

Related Articles