AKSHAY KUMAR : అక్షయ్ కుమార్ కు కోవిడ్ పాజిటివ్ ..!

అనంత్ అంబానీ రాధిక మర్చంట్ పెళ్లి హడావిడి గురించి తెలిసిందే కదా..బాలీవుడ్ లో హీరో , హీరోయిన్లు మంచి హడావిడిలో ఉంటుంది. బాలీవుడ్ ప్రముఖులంతా ...ఇక్కడే సందడి చేస్తున్నారు. ఇప్పటికే సినీ సెలబ్రెటీల నుంచి, వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు వేడుకకు అంటెండ్ అయ్యారు. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు సైతం ఈ పెళ్లికి బయల్దేరాడు. అయితే ఈ ఈవెంట్ కు అక్షయ్ కుమార్ హ్యాండ్ ఇచ్చేశాడు. 


Published Jul 12, 2024 04:39:00 PM
postImages/2024-07-12/1720782711_akshaykumar20239167515thumbnail.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అనంత్ అంబానీ రాధిక మర్చంట్ పెళ్లి హడావిడి గురించి తెలిసిందే కదా..బాలీవుడ్ లో హీరో , హీరోయిన్లు మంచి హడావిడిలో ఉంటుంది. బాలీవుడ్ ప్రముఖులంతా ...ఇక్కడే సందడి చేస్తున్నారు. ఇప్పటికే సినీ సెలబ్రెటీల నుంచి, వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు వేడుకకు అంటెండ్ అయ్యారు. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు సైతం ఈ పెళ్లికి బయల్దేరాడు. అయితే ఈ ఈవెంట్ కు అక్షయ్ కుమార్ హ్యాండ్ ఇచ్చేశాడు. 


ఇంతలోనే ...అక్షయ్ కుమార్ కు కోవిడ్ వార్త ఇప్పుడు బాలీవుడ్ నే కాదు..దేశ విదేశ ప్రముఖుల్లో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. అక్షయ్ కుమార్ మాత్రం ఈ పెళ్లికి హాజరు కాలేకపోతున్నాడట. అయితే భారత్ లో ఇంకా కోవిడ్ కేసులున్నాయని టెన్షన్ పడుతున్నారట విదేశాల ప్రముఖులు. అక్షయ్ కుమార్‌కు కొవిడ్ పాజిటీవ్ నిర్దారణ అయిందట. రీసెంట్‌గా ‘స‌ర్ఫిరా’ సినిమా ప్రమోషన్‌లలో పాల్గొన్న అక్షయ్‌ ఉన్నట్టుండి అనారోగ్యానికి గుర‌య్యారు.  


దాంతో అక్షయ్ కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. ఈ కారణంతోనే అనంత అంబానీ పెళ్లికి అక్షయ్ కుమార్ హాజరు కాలేకపోతున్నాడు. ఇక పోతే ఇప్పటికే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి దిగ్గజాలు పెళ్లిలో కనివిందు చేయడానికి రెడీ అయిపోయారు. దీనికిగాను కోట్లలో డబ్బులు కూడా తీసుకున్నారు.  బాలీవుడ్ తారాతోరణంతో పాటు టాలీవుడ్‌ ప్రముఖులు కూడా ఈ పెళ్లికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu wedding ananth-ambani

Related Articles