జీర్ణ సమస్యలు, అజీర్ణం, గ్యాస్ మరియు అతిసారం వంటి సమస్యలకు దారి తీస్తుంది. మద్యం కాలేయానికి హాని కలిగిస్తుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మందు అనగానే మాంసం మనకి ఆటోమెటిక్ గా వినిపిస్తుంది. ఆ కాంభినేషన్ కు జనాలు అలవాటుపడిపోయారు. ఇప్పుడు ఆడ , మగ తేడా లేదు.. ఇప్పుడు ఆల్కహాల్ చాలా కామన్ మ్యాటర్ అయితే మద్యంతో మాంసం తినడం ఇప్పుడున్న పరిస్థితులకు ఆరోగ్యమైన తిండి కాదంటున్నారు డాక్టర్లు.
మద్యం మరియు నాన్ వేజ్ రెండూ జీర్ణవ్యవస్థపై భారం పెడతాయి. ఇది జీర్ణ సమస్యలు, అజీర్ణం, గ్యాస్ మరియు అతిసారం వంటి సమస్యలకు దారి తీస్తుంది. మద్యం కాలేయానికి హాని కలిగిస్తుంది. మద్యం తాగడం వల్ల మీ కడుపులో కొన్ని యాసిడ్స్ ఫామ్ అవుతాయి. అవి నాన్ వెజ్ తో కలవడం చాలా ప్రమాదకరం ...మరి పాతకాలంలో సారా తాగి...మాంసం తినే వారు కదా అంటారేమో...అప్పుడు వారు తాగినా ...మాంసాన్ని అరగించుకునేంత శారీరక శ్రమ ఉండేది.
నాన్ వెజ్ ప్రోటీన్‌ను జీర్ణించుకోవడానికి కాలేయం అదనపు పని చేయవలసి ఉంటుంది. ఇది కాలేయంపై ఒత్తిడిని పెంచి, కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. మద్యం , మాంసం వల్ల కొలస్ట్రాల్ , రక్తపోటు , గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఇవి మద్యంతో కలిసి కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని పెంచుతాయి. మెదడు పనితీరు చాలా దారుణంగా పడిపోతుంది. చర్మం కూడా రంగు మారిపోతుంది. జుట్టు ఆరోగ్యం తగ్గుతుంది. వీటితో ఇక సిగరెట్ కూడా చేరితే మీ జీవిత కాలంలో మరో పదేళ్లు తగ్గిపోతాయని గుర్తు పెట్టుకొండి.