AA: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశ తప్పదా?

మరోసారి పుష్ప 2 సినిమా వాయిదా పడతున్నట్లు సమాచారం. దాంతో అల్లు అర్జున్ అభిమానులు నిరాశ చెందుతున్నారు


Published Jul 17, 2024 07:01:30 AM
postImages/2024-07-17/1721217536_bunny.PNG

న్యూస్ లైన్ డెస్క్: మరోసారి పుష్ప 2 సినిమా వాయిదా పడతున్నట్లు సమాచారం. దాంతో అల్లు అర్జున్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ముందుగా 2024 ఆగస్ట్ లో రిలీజ్ అని ఆశ పెట్టి మళ్లీ డిసంబర్ నెలకు వాయిదా వేశారు. కానీ ఈ సినిమా ఇపుడు మళ్లీ వచ్చే సంవత్సరం సమ్మర్ కి వాయిదా వేయనున్నట్టు టాక్ వినిపిస్తుంది. హీరోకి, డైరెక్టర్‌కి మధ్య స్క్రిప్ట్ విషయంలొ విబేధాలు వచ్చాయని సోషల్ మీడియాలో రూమర్స్ రావడం, ఆ కారణంగానే బన్నీ డేట్స్ ఇవ్వట్లేదని తెలుస్తోంది. అంతే కాకుండా ఇపుడు బన్నీ షేవింగ్ చేసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడం ఈ వార్తలకు బలాన్నిస్తుంది.

అదే కాకుండా ఫ్యామిలీతో బన్నీ ఫారిన్ ట్రిప్ వెళ్ళడం, అదే సమయానికి డైరెక్టర్ సుకుమార్ ఫారిన్ ట్రిప్ నుండి తిరిగి వస్తున్నారని సమాచరం. సినిమాలో కీలక పాత్ర పోషించిన ఫహాద్ ఫాజిల్ డేట్స్ ఇచ్చినపుడు పుష్ప టీం వాడుకోలేకపోయింది. ఇపుడు ఫహద్ డేట్స్ అవసరం అయిన సమయంలో ఆయన వేరే సినిమాలతో బిజీ ఉన్నారని తెలుస్తోంది. దీంతో పుష్ప 2 మరోసారి వాయిదా పడనుందా అని అభిమానులు నిరాశ చెందుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana allu-arjun sukumar pushpa2

Related Articles