ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రహమాన్ వైవాహిక జీవితానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సినీ ఇండస్ట్రీలో ఏ ఆర్ రెహ్మాన్ కు పరిచయం అవసరం లేదు. మ్యూజిక్ వరల్డ్ లో ఏ ఆర్ రెహ్మాన్ కు ఓ స్పెషల్ ప్లేస్ ఉంది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రహమాన్ వైవాహిక జీవితానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్ని ఏ ఆర్ రెహ్మాన్ వైఫ్ అనౌన్స్ చేశారు. సైరా భానుతో 29 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత ఇలా విడిపోవడం పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సైరాబాను, రెహమాన్ విడాకుల విషయాన్ని సైరా బాను తరుపు లాయర్ వందనా షా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కాగా, 1995 మార్చి లో ఈ జంటకు వివాహం జరిగింది. మరికొద్ది రోజుల్లో 30వ వివాహ వార్షికోత్సవం జరపుకోనున్న ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
వ్యక్తిగత కారణాల కారణంగా ఈ క్రమంలోనే ఇరువురి అంగీకారం మేరకు విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నారు. ఏఆర్ రెహమాన్, సైరా భానులది పెద్దలు కుదిర్చిన పెళ్లి. 1995, మార్చి 12న వీరిద్దరు నిఖా చేసుకున్నారు. ఈ జంటకు ఖతీజా, రహిమా అనే ఇద్దరు కూతుళ్ళతో పాటు అమీన్ అనే కొడుకు ఉన్నారు. నిజానికి 30వ పెళ్లి రోజు జరుపుకోవాలనుకున్నాం. కాని ఊహించని విధంగా ఇలా విడిపోవాల్సి వచ్చింది. కాని మా నిర్ణయాన్ని గౌరవించండి అంటూ పోస్ట్ చేశారు.