ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అసిస్టెంట్ మోహిని డే తన భర్తకి విడాకులు ఇచ్చి సపరేట్ అయినట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఏ ఆర్ రెహ్మాన్ విడాకుల సంగతే...ఇండస్ట్రీకి షాకింగ్ ఉంటే ...రెహమాన్ డివోర్స్ ప్రకటించిన వెంటనే తన అసిస్టెంట్ కూడా తన భర్తకు విడాకులు ఇవ్వడం ప్రస్తుతం ఫుల్ వైరల్ అవుతుంది.
ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అసిస్టెంట్ మోహిని డే తన భర్తకి విడాకులు ఇచ్చి సపరేట్ అయినట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ సైతం షేర్ చేసింది. ” మార్క్ ఇంకా నేను సపరేట్ అవ్వడానికి నిర్ణయించుకున్నాం. మా ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ అందరి ఇష్టపూర్వకంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. అయితే సపరేట్ అయినా..నా ప్రాజెక్ట్స్ తనతో చాలా ఉన్నాయి. అవి కంటిన్యూ అవుతాయని తెలిపింది.
అసలు రెహమాన్ విడాకులు ఇచ్చిన వెంటనే ఆయన అసిస్టెంట్ కూడా విడాకులు ఇవ్వడమేంటి..? మోహినీ వల్లే రెహమాన్ విడాకులు తీసుకున్నారా ...ఏం జరుగుతుందనేది మిలియన్ డాలర్ల క్వశ్చన్. ఆమె వల్లనే రెహమాన్ విడాకులు తీసుకున్నారా అన్న కోణంలో చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకేసారి వీరిద్దరూ విడాకులు ఎందుకు తీసుకున్నారన్నది తెలియాల్సి ఉంది.