Renu Desai: రేణూ దేశాయ్ తల్లి కన్నుమూత.. !

ఓ తల్లి గర్భంలో జన్మించక తప్పదు’ అంటూ ఆది శంకరాచార్యుల చెప్పిన మాటలను తన పోస్టులో పొందుపరిచింది రేణూ దేశాయ్.


Published Nov 21, 2024 09:36:00 PM
postImages/2024-11-21/1732205207_renudesaimotherpassedawayb2111240814.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రముఖ నటి రేణుదేశాయ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తన తల్లి కన్ను మూశారు. ఈ విషయాన్ని రేణూదేశాయ్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన తల్లికి సంబంధించిన పాత ఫొటోను అందులో షేర్ చేసిన రేణూ దేశాయ్ ఒక శ్లోకాన్ని అందులో జత చేసింది. పునరపి జననం పునరపి మరణం..పునరపి జననీ జఠరే శయనం.. ఇహ సంసారే బహుదుస్తారే..కృపయాపారే పాహి మురారే.. మళ్లీ మళ్లీ పుడుతుంటారు.. మళ్లీ మళ్లీ చనిపోతుంటారు. మళ్లీ ఓ తల్లి గర్భంలో జన్మించక తప్పదు’ అంటూ ఆది శంకరాచార్యుల చెప్పిన మాటలను తన పోస్టులో పొందుపరిచింది రేణూ దేశాయ్.


రేణుదేశాయ్ ఫ్యాన్స్ తో పాటు పవన్ కళ్యాణ్ ప్యాన్స్ కూడా ఆవిడకు సంతాపం తెలియజేస్తున్నారు. రేణుదేశాయ్ తల్లికి సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. రేణూ దేశాయ్ తన పిల్లలు అకీరా నందన్, ఆద్యల బాగోగులకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తోంది. అదే సమయంలో  సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటోంది.  ముఖ్యంగా అనాథ పిల్లలు, మూగ జీవాల కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంటుంది.


 ఇక కొన్ని రోజుల క్రితమే తన కూతురు ఆద్య పేరు మీదుగా శ్రీ ఆద్య యానిమల్‌ షెల్టర్‌’ అనే ఎన్జీవోను ప్రారంభించిందీ అందాల తార. అయితే ఇప్పుడు రేణుదేశాయ్ ను స్ట్రాంగ్ గా ఉండాలంటు కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్.

newsline-whatsapp-channel
Tags : pawankalyan newslinetelugu fans renudesai mother died

Related Articles