న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సనాతన ధర్మంలో మతం లేదు...సనాతన ధర్మం ఓ సిధ్దాంతం ..జీవన మార్గం. అంతేకాని ధర్మాన్ని మతానికి జోడించి మాట్లాడడం అసలు మంచిది కాదుంటున్నారు రాధా మనోహర్ దాస్. రీసెంట్ గా అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్ ..ఏ ఆర్ రెహమాన్ కు ఇచ్చిన మాట ప్రకారం కడప దర్గా కు వెళ్లడం జరిగింది. సోషల్ మీడియా వేదికా చాలా మంది ఈ విషయంపై రామ్ చరణ్ ను తప్పుపట్టారు. హిందువై ..అది కూడా మాలలో ఉన్నపుడు దర్గా కు వెళ్లడం పై చరణ్ కు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రాధా మనోహర్ దాస్ అండగా నిలిచారు.
రాధా మనోహర్ దాస్ మాట్లాడుతూ... రామ్ చరణ్ నిజమైన భక్తుడని అన్నారు. శివాలయాన్ని చరణ్ శుభ్రం చేస్తాడని... వారి పాపకు క్లీంకార అనే పేరు పెట్టాడని తెలిపారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రమోషన్స్ సమయంలో విదేశాలకు వెళ్లినప్పుడు కూడా రాముల వారిని వెంట తీసుకెళ్లారని చెప్పారు. చరణ్ తప్పు చేసినట్టు ఎవరికైనా అనిపిస్తే తన వద్దకు రావాలని... కూర్చొని మాట్లాడుకుందామని అన్నారు. తను ధర్మం గా ఉంటూనే తన నమ్మకాలను గౌరవిస్తూ పక్క వారి నమ్మకాలను గౌరవించాడని ఇది చాలా మంచి నిర్ణయమని తెలిపారు.
ఇదే అంశంపై చరణ్ భార్య ఉపాసన స్పందిస్తూ... . భారతీయత అంటేనే భిన్నత్వంలో ఏకత్వమని... చరణ్ దానినే అనుసరించాడని చెప్పారు. అయితే అయ్యప్ప దీక్షలో ఉంటూ కడప దర్గా కు వెళ్లడం తప్పేం కాదంటున్నారు నెటిజన్లు. కాని కొందరికి ఇది నచ్చలేదు.