తన ఇన్ స్టా గ్రామ్ ఖాతా ద్వారా బోలెడు ఫ్యాషన్ టిప్స్ చెబుతూ కొత్త పోస్టులు వేస్తూ గ్లోబల్ ఐకాన్ గా మారింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఫ్యాషన్ సెన్స్ ఉండాలే కాని ఏ ఏజ్ లో అయినా స్మార్ట్ గా ఉండొచ్చని ప్రూవ్ చేసింది ఓ బామ్మ. ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ గా ఎదిగి అందరిని ఆశ్చర్యపరిచింది కూడా.ఈ బామ్మ స్టైల్‌ని చూస్తే వందేళ్లు వచ్చినా ఏ మాత్రం తగ్గకూడదు.. అనిపించేస్తుంది.
జాంబియాకు చెందిన మార్గరెట్ చోలా.. అనే 85 ఏళ్ల వృద్ధురాలు ఊహించని రీతిలో గ్లోబల్ ఫ్యాషన్ ఐకాన్‌గా మారింది. తన ఇన్ స్టా గ్రామ్ ఖాతా ద్వారా బోలెడు ఫ్యాషన్ టిప్స్ చెబుతూ కొత్త పోస్టులు వేస్తూ గ్లోబల్ ఐకాన్ గా మారింది. మార్గరెట్ చోలా బామ్మకు 1,05,000 మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోండి. లెంజడరీ గ్లామా పేరుతో ఇన్ స్టా లో సీరిస్ చేస్తుంది.
లెటెస్ట్ స్టైల్‌లో దుస్తులను ధరించి.. ఫొటోలకు ఫోజులిస్తుంది. ఆనక వాటిని తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేస్తుంది. ఆమె పోస్టు పెడితే చాలు లక్షల్లో వ్యూస్ ...వేలల్లో కామెంట్లు. ఆవిడ క్రియేటివిటీకి న్యూయార్క్ లో ఉంటున్న తన మనవరాలికి ఈ ఐడియా వచ్చిందట. Ms చోల “గ్రానీ సిరీస్” పేరిట వెబ్ సిరీస్ తీసింది. దీంతో బామ్మ డ్రెస్-అప్ సెషన్‌లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి.