Balakrishna: కొడుకు తో పాటు కూతురు కూడా ఎంట్రీ.. బాలకృష్ణ భారీ ప్లాన్.? 

నందమూరి నటసింహం బాలకృష్ణ అటు సినిమాలు ఇటు రాజకీయాలు రెండు బ్యాలెన్స్ చేస్తూ  సినిమాల్లో, రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు.బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుంది అని మూడు సంవత్సరాల నుండి వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.కానీ ఎట్టకేలకు ఈ ఏడాది బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా మోక్షజ్ఞ తేజ నే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులకు తెలియజేశారు. కొడుకుతో పాటు కూతుర్ని కూడా సినిమాల్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట బాలకృష్ణ.మోక్షజ్ఞ మొదటి సినిమాతోనే తేజస్వినిని కూడా నిర్మాతగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.మరి చూడాలి తేజస్విని సోదరుడి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది


Published Jul 12, 2024 05:50:00 PM
postImages/2024-07-12/1720784693_balakrishna.jpg

న్యూస్ లైన్ డెస్క్: నందమూరి నటసింహం బాలకృష్ణ అటు సినిమాలు ఇటు రాజకీయాలు రెండు బ్యాలెన్స్ చేస్తూ  సినిమాల్లో, రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. అంతేకాదు ఈయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మంది పేద ప్రజలకు సహాయం కూడా చేస్తున్నారు. అలాగే హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా అక్కడి ప్రజలకు ఎన్నో సహాయక సహకారాలు అందిస్తూ అభివృద్ధి చేస్తున్నారు. ఇక గత రెండు మూడు నెలల నుండి రాజకీయాల్లో బిజీగా ఉన్న ఈయన ప్రస్తుతం తన ఫుల్ ఫోకస్ సినిమాలపైనే పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం బాలకృష్ణ ఎన్.బి.కె109 సినిమాతో పాటు అఖండ -2లో కూడా నటించ బోతున్నారు. అయితే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుంది అని మూడు సంవత్సరాల నుండి వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.కానీ ఎట్టకేలకు ఈ ఏడాది బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా మోక్షజ్ఞతేజనే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులకు తెలియజేశారు.

దాంతో మోక్షజ్ఞ వస్తున్నాను అని పోస్ట్ పెట్టడంతోనే నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేవు అనుకోండి.. అయితే కొడుకును సినిమాల్లోకి తీసుకురావాలి అనుకుంటున్న బాలకృష్ణ ఓ సూపర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. అదేంటంటే..కొడుకుతో పాటు కూతుర్ని కూడా సినిమాల్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట.అయితే చాలా సంవత్సరాల నుండి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని కూడా సినిమాల్లోకి రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు అది జరగలేదు.

అయితే మోక్షజ్ఞ మొదటి సినిమాతోనే తేజస్వినిని కూడా నిర్మాతగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా బాలకృష్ణ తన ఇద్దరు పిల్లల్ని ఒకేసారి ఇండస్ట్రీకి పరిచయం చేసి సక్సెస్ కొడతారు అని నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మరి చూడాలి తేజస్విని సోదరుడి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది

newsline-whatsapp-channel
Tags : newslinetelugu balakrishna mokshagna akhanda2 tejaswini nbk-109

Related Articles