ఈ కాంట్రాక్టు తగిసుకొని సంవత్సరం అవుతోంది. అయితే, ఇప్పటికీ దీనికి సంబంధించిన పనులను మొదలు పెట్టలేదు. విద్యుత్ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం RDSSలో భాగంగా కాంట్రాక్టు తీసుకున్న పనులనుఇచ్చిన సమాయంలోనే పూర్తి చేయాలి.
న్యూస్ లైన్ డెస్క్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం పెద్ద ఝలక్ ఇచ్చింది. పొంగులేటికి సంబంధించిన రాఘవ నిర్మాణ సంస్థకు ఏపీ సర్కార్ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. ఏపీలోని EPDCL పరిధిలో భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు రూ.1,194 కోట్లతో పిలిచిన టెండరును శ్రీనివాస రెడ్డి దక్కించుకున్నారు. ఈ సంస్థకు అధికారులు నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది.
ఈ కాంట్రాక్టు తగిసుకొని సంవత్సరం అవుతోంది. అయితే, ఇప్పటికీ దీనికి సంబంధించిన పనులను మొదలు పెట్టలేదు. విద్యుత్ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం RDSSలో భాగంగా కాంట్రాక్టు తీసుకున్న పనులనుఇచ్చిన సమాయంలోనే పూర్తి చేయాలి. కేంద్రం నుంచి వచ్చే గ్రాంటు నిలిచిపోయే అవకాశం ఉంది.
ఇక దీనికి సంబంధించి ప్రతి నెలా డిస్కం అధికారులు నోటీసులు పంపుతున్నా పొంగులేటి నుండి ఎలాంటి స్పందన రాలేదట. దీంతో ఈ విషయాన్ని ఏపీ సర్కార్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే పనులు మొదలుపెట్టకపోతే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించినట్లు సమాచారం.