Anganwadi : పది, ఏడో తరగతి అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు..చివరి తేదీ ఇదే

అంగన్ వాడీ కేంద్రాల్లో మినీ అంగన్ వాడీ కార్యకర్త, అంగన్ వాడీ సహాయకురాలు పోస్టుల భర్తీకి మహిళా అభివృధ్ధి , శిశు సంక్షేమ అర్హులైన అభ్యర్ధుల నుంచి అప్లికేషన్స్ కోరుతుంది. కాని ఈ పోస్టులకు లేడీసే అర్హులు. మీకు కాని ఇంట్రస్ట్ ఉంటే సెప్టెంబర్ 17వ తేదీలోగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.


Published Sep 13, 2024 10:16:00 AM
postImages/2024-09-13/1726202871_untitleddesign20230705t160255.68616885531833x2.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తక్కువ విద్యార్హాత తో ఉద్యోగాలు అంటే అంగన్వాడీ బెస్ట్ ఆప్షన్. వైఎస్సార్ జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో భాగంగా చాలా ప్రాంతాల్లోని అంగన్ వాడీ కేంద్రాల్లో మినీ అంగన్ వాడీ కార్యకర్త, అంగన్ వాడీ సహాయకురాలు పోస్టుల భర్తీకి మహిళా అభివృధ్ధి , శిశు సంక్షేమ అర్హులైన అభ్యర్ధుల నుంచి అప్లికేషన్స్ కోరుతుంది. కాని ఈ పోస్టులకు లేడీసే అర్హులు. మీకు కాని ఇంట్రస్ట్ ఉంటే సెప్టెంబర్ 17వ తేదీలోగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.


ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 74 పోస్టులను భర్తీ చేయనున్నారు. సీకే దిన్నె, ముద్దనూరు, కమలాపురం, చాపాడు, ప్రొద్దుటూరు అర్బన్, ప్రొద్దుటూరు రూరల్, కడప-1, పోరుమామిళ్ల, పులివెందుల, మైదుకూరు, బద్వేల్, జమ్మలమడుగు ప్రాంతాల్లో ఈ అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నారు.


పోస్టుల వివరాలు..
మినీ అంగన్‌వాడీ కార్యకర్త పోస్టులు: 4
అంగన్‌వాడీ కార్యకర్త పోస్టులు: 59
అంగన్‌వాడీ సహాయకురాలు పోస్టులు: 11
*అంగన్‌వాడీ కార్యకర్త పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా 10వ తరగతి పాసై ఉండాలి. 
* మిగిలిన పోస్టులకు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 
*అలాగే దరఖాస్తు చేసుకునే మహిళలు తప్పనిసరిగా స్థానికులై ఉండాలి. వయోపరిమితి కింద అభ్యర్ధుల వయసు జులై 1, 2024 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్‌ 17, 2024వ తేదీలోపు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆ అప్లికేషన్స్ ను ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఇవ్వాలి.


 ఏడు, పదో తరగతిలో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ సెప్టెంబర్‌ 28, 2024వ తేదీన ఉంటుంది. జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయం, కడప.. అడ్రస్‌లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.


పదో తరగతిలో వచ్చిన మార్కులకు 50, ప్రీ స్కూల్‌ టీచర్‌ ట్రైనింగ్‌కు 5 మార్కులు, విడో మహిళ అయితే 5 మార్కులు, మైనర్ పిల్లలు కలిగిన విడో మహిళకు 5 మార్కులు, అనాథ లేదా బాలా సథన్‌లో చదివిన వారికి 10 మార్కులు, వికాలాంగులకు 5 మార్కులు, మౌఖిక ఇంటర్వ్యూకి 20.. ఇలా మొత్తం 100 మార్కులకు జిల్లా ఎంపిక కమిటీ ఇంటర్వ్యూలో మార్కులు ఇస్తారు. వీరిలో కంప్లీట్ మెరిట్ ఆధారంగానే సెలక్షన్స్ జరుగుతాయి.

newsline-whatsapp-channel
Tags : andhrapradesh newslinetelugu anganwadi jobs

Related Articles