BIGBOSS 8: బిగ్ బాస్ తెలుగు 8 ఫస్ట్ ప్రోమో ..కంటెస్టెంట్స్ వీరే

బిగ్ బాస్ లవర్స్ కు గుడ్ న్యూస్ . బిగ్ బాస్ ను టెన్షన్ గా చూసే ఆడియన్స్ చాలా ఎక్కువ ఉంటారు. వారికి బిగ్ బాస్ తెలుగు 8 అప్డేట్ వచ్చేసింది. సీజన్ 8 ఫస్ట్ ప్రొమో విడుదల చేశారు.లొగో ను కూడా విడుదల చేశారు.  లొగో అద్దిరిపోయింది .బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ సక్సెస్. బిగ్ 6 ప్లాప్ తర్వాత చాలా మార్పులు చేసి 7 ను కాస్త ఇంట్రస్టింగ్ గా ప్లాన్ చేశారు. హిట్ట్ అయ్యింది .పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు.


Published Jul 21, 2024 12:35:04 PM
postImages/2024-07-21/1721577618_1462444bb.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ :  బిగ్ బాస్ లవర్స్ కు గుడ్ న్యూస్ . బిగ్ బాస్ ను టెన్షన్ గా చూసే ఆడియన్స్ చాలా ఎక్కువ ఉంటారు. వారికి బిగ్ బాస్ తెలుగు 8 అప్డేట్ వచ్చేసింది. సీజన్ 8 ఫస్ట్ ప్రొమో విడుదల చేశారు.లొగో ను కూడా విడుదల చేశారు.  లొగో అద్దిరిపోయింది .బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ సక్సెస్. బిగ్ 6 ప్లాప్ తర్వాత చాలా మార్పులు చేసి 7 ను కాస్త ఇంట్రస్టింగ్ గా ప్లాన్ చేశారు. హిట్ట్ అయ్యింది .పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు.

గత మూడు నెలలుగా బిగ్ బాస్ 8పై అనేక రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. లాంచింగ్ డేట్ ఫిక్స్ అయ్యిందని, కంటెస్టెంట్స్ వీరే అని బోలెడు రూమర్స్ వచ్చేశాయి . ఫైనల్ గా అధికారిక ప్రకటన వచ్చేసింది. బిగ్ బాస్ తెలుగు 8 ప్రోమో నాగార్జున స్వయంగా విడుదల చేశారు. అది కూడా నాగార్జున ట్విట్టర్ అకౌంట్ నుంచి రిలీజ్ అయ్యింది.


బిగ్ బాస్ తెలుగు 8 లోగో గర్వంగా ప్రజెంట్ చేస్తున్నాము. అనంతమైన ఎంటర్టైన్మెంట్ ఆస్వాదిచేందుకు మీరు సిద్ధమా.. అని నాగార్జున రాసుకొచ్చారు. బిగ్ బాస్ నెంబర్ 8ని ఇన్ఫినిటీ ని తలపించేలా డిజైన్ చేశారు. మధ్యలో ఓ ఫ్లవర్ ను ప్రజెంట్ చేశారు. లొగోలోనే మనకు అన్నీ సంగతులు డీటైల్ గా ఇచ్చారు. అవి డీ కోడ్ చెయ్యడం మాత్రం టైం టేకింగ్ ప్రాసెస్ అనే చెప్పాలి. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారం బిగ్ బాస్ సీజన్ 8 లాంచింగ్ ఎపిసోడ్ కి ముహూర్తం కుదిరి ఉండవచ్చు. అయితే ఎప్పుడు లాంచింగ్ అనేది మాత్రం నాగార్జున కాని టీం కాని అనౌన్స్ చెయ్యలేదు. 


బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను మాత్రం గట్టిగా వినిపిస్తున్న పేర్లు ఇవే ..


బర్రెలక్క, కుమారీ ఆంటీ, యూట్యూబర్ బంచిక్ బబ్లు, నటి హేమ, నటి సురేఖావాణి, సోనియా సింగ్, కిరాక్ ఆర్పీ, బుల్లెట్ భాస్కర్, వర్షిణి సుందరరాజన్, రీతూ చౌదరి, అంబటి రాయుడు, వేణు స్వామి, అమృత ప్రణయ్... బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారట. కన్నడ యాక్టర్ ప్రేరణ ఖన్నా వెళ్లొచ్చు. ఈ ప్రొమోతో మరోసారి నాగార్జున హోస్టింగ్ చేస్తున్నారని తెలుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu big-boos8

Related Articles