bigboss: బిగ్ బాస్-8 కి నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా !

బుల్లితెర మీద బిగ్ బాస్ కు ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. చాలా స్పెషల్ ...కొంత మందికి బిగ్ బాస్ లైఫ్ ఇస్తే ..మరికొంతమంది బిగ్ బాస్ మీద బ్రతకుతున్నారు. కోట్ల బిజినెస్  , సెలబ్రెటీస్ అబ్బో ఈ హడావిడి అంతా ఇంత కాదు. 


Published Jul 25, 2024 02:22:00 PM
postImages/2024-07-25/1721897607_nagarjunakingm369a.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : బుల్లితెర మీద బిగ్ బాస్ కు ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. చాలా స్పెషల్ ...కొంత మందికి బిగ్ బాస్ లైఫ్ ఇస్తే ..మరికొంతమంది బిగ్ బాస్ మీద బ్రతకుతున్నారు. కోట్ల బిజినెస్  , సెలబ్రెటీస్ అబ్బో ఈ హడావిడి అంతా ఇంత కాదు. రీసెంట్ గా కింగ్ నాగార్జున ఈ షోకు సంబంధించిన లోగో ను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే తాజాగా ఆయన రెమ్యూనరేషన్ గురించి ఓ టాక్ వినిపిస్తోంది. గత సీజన్ల కంటే.. ఈ సారి రెమ్యూనిరేషన్ గట్టిగా తీసుకుంటున్నారట. 


ఇక గతంలో మాదిరిగానే బిగ్‍బాస్ 8వ సీజన్‍కు కూడా కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేయనున్నారు. అయితే, గత సీజన్‍తో పోలిస్తే ఈ కొత్త సీజన్‍కు ఆయన రెమ్యూనరేషన్ భారీగా పెరిగిందట. బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ కోసం నాగ్ ఏకంగా రూ.30కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోనున్నారని సమాచారం. 7వ సీజన్ కోసం రూ.20కోట్లను నాగ్ అందుకున్నారు. అయితే, బిగ్ బాస్ సీజన్ 8 కోసం రూ.10కోట్లు అదనంగా అంటే.. రూ.30కోట్లను తీసుకుంటున్నారని టాక్ ఫిల్మ్ ఇండస్ట్రీ గుసగుసలు చెప్పుకుంటున్నాయి.


కాని ఫిగర్ కరక్ట్ అని చెప్పలేకపోయినా ...రెమ్యూనిరేషన్ మాత్రం పెంచాడట నాగార్జున. ప్రతి సీజన్ కి రేంజ్ పెంచి రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారంటున్నారు నెటిజన్లు.బిగ్‍బాస్ 8వ సీజన్‍లోనూ అదే జోష్ కొనసాగిస్తారని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఆగష్టు లో బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. ఇక సోషల్ మీడియా హడావిడి చూడాల్సిందే.

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu nagarjuna big-boos8

Related Articles