ఇప్పటికే బిగ్ బాస్ మొదలై రెండు రోజులు కూడా గడవలేదు. కంటెస్టెంట్ల మధ్య కొట్లాట పెట్టించారు. అయితే ఇంతకుముందు సీజన్ లా బిగ్ బాస్ ఉండకూడదని ఇంతకుముందు ఎవరో ఒకరు కెప్టెన్ గా ఉండేవారు. కానీ
న్యూస్ లైన్ డెస్క్: ఇప్పటికే బిగ్ బాస్ మొదలై రెండు రోజులు కూడా గడవలేదు. కంటెస్టెంట్ల మధ్య కొట్లాట పెట్టించారు. అయితే ఇంతకుముందు సీజన్ లా బిగ్ బాస్ ఉండకూడదని ఇంతకుముందు ఎవరో ఒకరు కెప్టెన్ గా ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదట 3లీడర్లను ఎన్నుకుంటారట. వారు చెప్పిన దాని ప్రకారమే బిగ్ బాస్ రన్ అవుతుందని ఆయన చెప్పకనే చెప్పారు. ఇదే తరుణంలో సోమవారం చీఫ్ ల ఎంపిక కోసం కంటెస్టెంట్ల మధ్య విపరీతమైన పోరు జరిగింది. ఎలా జరిగింది?ఎవరు ఎంపిక అయ్యారు అనే వివరాలు చూద్దాం.
బిగ్ బాస్ మొదటి రోజు యష్ కరో అనే పాటతో మొదలైంది. ఆ తర్వాత నిత్యవసర సరుకులను హౌస్ లోకి పంపించారు. డైనింగ్ హాల్ దగ్గర కంటెస్టెంట్లు మాట్లాడుకుని పనులు మొదలుపెట్టారు. ఇంతలో హీరో ఆదిత్య, కంటెస్టెంట్ నాగ మణికంఠ వద్దకు వచ్చి సారీ చెప్పాడు. ఎవరిని హౌస్ లో నుండి బయటకు పంపాలి అంటే కావాలని నీ పేరు చెప్పలేదు అంటూ ఒక క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేయడంతో, దీనికి మణికంఠ వదిలేయండి బాస్ అన్నట్లు మాట్లాడాడు. అలా కాసేపు సైలెంట్ గా ఉన్న తర్వాత మణికంఠ ఏం చెప్పాలో ఏం ఆడాలో నాకు తెలుసు ఎవరి సలహాలు నాకు అక్కర్లేదు అంటూ పంచ్ విసిరారు.
దీంతో కాస్త కోపానికి వచ్చిన నిఖిల్ .. ఓకే వదిలేయ్ అయినా అందరి ఇక్కడికి కష్టపడే వచ్చారు. నీ గురించి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదంటూ డిస్కషన్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత వంటగదిలో కుక్కర్ సమస్యపై సోనియా మధ్య గొడవ జరిగింది. ఇందులో బేబక్క బాధ్యతగా లేదంటూ సోనియా ఆరోపించింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పండ్లతో ఆటలు ఆడడంతో సోనియా ఆర్జె, శేఖర్ భాషా మధ్య గొడవ జరిగింది. ఈ పండ్లతో ఆడిన వాళ్ళు అవి తినడానికి వీలులేదని ఫుడ్డును అగౌరపరిచారని సోనియా అన్నారు. దీంతో శేఖర్ భాష ఆడాను.. తింటాను అని వాదించడం మొదలుపెట్టారు. మేము మనుషుల్లా తినాలనుకుంటున్నామని సోనియా అన్నారు.
దీంతో కోపం తెచ్చుకున్న శేఖర్ బాషా నేను మనిషిని కాదా ఇది తింటే పశువునా అంటూ గట్టిగా అరిచాడు. ఆ తర్వాత బిగ్బాస్ "పట్టుకొని ఉండండి" అనే టాస్క్ ఇవ్వడంతో ఇందులో యస్మి గౌడ, శేఖర్ భాషా, ఆఫ్రిది, నిఖిల్, నైనిక, బేబక్క పోటీలో ఉన్నారు. తాళ్లని ఎక్కువసేపు పట్టుకున్న వాళ్లే విన్నర్. ఈ టాస్క్ లో నిఖిల్ గెలుపొందారు. దీంతో ఆయన ఎనిమిదవ సీజన్ ఫస్ట్ చీఫ్ ఎంపిక అయ్యారు. ఆ తర్వాత 'బ్రిక్స్ బ్రేకింగ్' అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ విధంగా మొదటి రోజే కంటెస్టెంట్ల మధ్య మూడు తిట్లు ఆరు గొడవలుగా సాగింది. అలా రెండవ చీఫ్ గా నైనిక, మూడో చీఫ్ గా యష్మి గౌడ ఎంపిక అయ్యారు.