పతకాల వారిగా చూసుకుంటే ఆస్ట్రేలియా టాప్ ప్లేస్‌లో ఉంది. 3 స్వర్ణ పతకాలు, 2 రజత పతకాలతో మొత్తం 5 మెడల్స్ సాధించింది.
న్యూస్ లైన్, స్పోర్ట్స్: పారిస్ ఒలింపిక్స్‌లో పతకాల ఖాతా తెరిచింది భారత్. ఎయిర్ పిస్టల్ విభాగంలో తొలి పతకం అందుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మనుబాకర్‌కు కాంస్య పతకం దక్కింది. 221.7 పాయింట్లతో సాధించి కాంస్యం పతకం అందుకుంది. ఇదే విభాగంలో ఇద్దరు కొరియన్లకు స్వర్ణం, రజత పతకం సాధించారు. ఓయె జిన్ 243.2 పాయింట్లు, కిమ్ 241.3 పాయింట్లు సాధించారు.
పతకాల వారిగా చూసుకుంటే ఆస్ట్రేలియా టాప్ ప్లేస్‌లో ఉంది. 3 స్వర్ణ పతకాలు, 2 రజత పతకాలతో మొత్తం 5 మెడల్స్ సాధించింది. ఆ తర్వాత చైనా 3 గోల్డ్ మెడల్, 1 రజతంతో సెకండ్ ప్లేస్ లో కొరియా 2 గోల్డ్ మెడల్స్, 2 రజతం, ఒక కాంస్య పతకంతో థర్డ్ ప్లేస్ లో ఉంది. ఇండియా ఒక కాంస్య పతకంతో 17వ స్థానంలో కొనసాగుతోంది.